ఆంధ్రప్రదేశ్‌

డిఎస్సీ 2014 అభ్యర్థులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: గడచిన రెండేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న డిఎస్సీ 2014 అభ్యర్థుల కలలు ఎట్టకేలకు నెరవేరబోతున్నాయి. సుమారు 10,300 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం జరిగిన డిఎస్సీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు 2015 జూన్ 2వ తేదీ విడుదలయ్యాయి. కోర్టు వివాదాలతో నియామకాల ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. దీనిపై అభ్యర్థులు రెండేళ్లుగా ఆందోళన చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఉపాధ్యాయుల పోస్టులను విద్యా సంవత్సరం ఆరంభంలోపు భర్తీ చేయాలనే కృత నిశ్చయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం నియామకాల ప్రక్రియలకు సంబంధించిన షెడ్యూల్‌ను వెలువరించారు. 4,20,702 మంది దరఖాస్తు చేసుకోగా 3,96,326 మంది పరీక్షలకు హాజరయ్యారు. దీనికి సంబంధించి ఈ నెల 25న ఎంపికైన అర్హుల జాబితాను ప్రకటిస్తారు. 26న సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుంది. 29-31 తేదీల మధ్య వెబ్ కౌనె్సలింగ్ జరుగుతుంది. జూన్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా నియామక పత్రాలు అందజేస్తారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారనే ప్రచారం సరైంది కాదని, వీటిని బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. నీట్‌పై రెండు మూడు రోజుల్లో ఒక విధాన నిర్ణయం జరగగలదన్నారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ఈ అంశాన్ని కూడా కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారని అన్నారు. రాజధాని ప్రాంతంలో జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో 50 శాతం ఫీజు రాయితీ కల్పించేందుకు తక్షణం ఉత్తర్వులు జారీ చేస్తామని గంటా తెలిపారు.