ఆంధ్రప్రదేశ్‌

కొంపముంచిన పీకే సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 28: పార్టీ ఉనికికి సవాలుగా మారిన నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ ఓటమికి జగన్ నియమించుకున్న కన్సల్టెంట్ ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాలు, చేసిన సర్వేలే కారణమని ఆ పార్టీ సీనియర్లు విరుచుకుపడుతున్నారు. ఇకపైనా పీకేను కొనసాగిస్తే పార్టీని పీకేయించేస్తారేమోనన్న వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి. సొంత మీడియా గెలుపుపై అతి విశ్వాసంతో తప్పుడు నివేదికలు ఇవ్వటం కొంపముంచిందని నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఉప ఎన్నికలో జగన్ ప్రచారం చేస్తున్న సమయంలో, మొదట్లో తమ పార్టీ వైపే కొద్దిగా మొగ్గు ఉన్నప్పటికీ, దానిని పీకే బృందం ఎక్కువగా చూపిందంటున్నారు. జగన్ ప్రచారానికి వస్తున్న స్పందన చూసిన తర్వాత మేల్కొన్న టిడిపి అనంతర వ్యూహాన్ని పసిగట్టడంలో పీకే బృందం ఘోరంగా దెబ్బ తిన్నది.పోలింగ్‌కు రెండు రోజుల ముందు కూడా తమ పార్టీ 17వేల మెజారిటీతో గెలుస్తుందని పికె బృందం నివేదిక ఇచ్చింది. సొంత మీడియా కూడా 15-20 వేలతో గెలుస్తుందని పేర్కొంది. వీటిని జగన్ విశ్వసించారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. జగన్ సభలకు వచ్చిన జనాలను చూసి పీకే బృందం దానిని ఫలితాలను ఊహించింది. ఉత్తరాదిలో ఒక సభకు 10-20 వేల మంది వస్తే అదే పెద్దదని, బహుశా ఇప్పటిదాకా ఉత్తరాదిలోనే సర్వే చేసిన పీకే బృందం, దాన్ని చూసి వైసీపీ అభ్యర్థి మెజారిటీని ఊహించి ఉంటుందన్నారు.బాబును కాల్చిచంపినా తప్పులేదు, నడిరోడ్డుమీద ఉరితీయండంటూ జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ విజయావకాశాలను గణనీయంగా దెబ్బ తీశాయి. ఈ వ్యాఖ్యలు ఉప ఎన్నిక సరళిని ఒక్కసారిగా మార్చివేశాయి. జగన్ ఆవేశంలో మాట్లాడినా, దాన్ని టిడిపి శ్రేణులు బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాయి. ‘ఒక్క నియోజకవర్గంలోనే సరైన ఫలితం తెలుసుకోలేని పీకే బృందం 175నియోజకవర్గాల్లో ఇక పార్టీని ఆయనేం గెలిపిస్తార’ని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ నేత అసంతృప్తి వ్యక్తం చేశారు.