ఆంధ్రప్రదేశ్‌

పనిచేసే ప్రభుత్వానికి పట్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 28: నంద్యాల ఉప ఎన్నికలో ప్రజలు పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టారని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం విజయనగరం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చాక జరిగిన మొట్టమొదటి ఉప ఎన్నిక కావడంతో అందరూ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కనబరిచారన్నారు. ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ నేత 14 రోజులపాటు అక్కడే ఉండి ప్రచారం చేసిన దాఖలాలు గతంలో లేవని, నేడు ఈ ఉప ఎన్నికలో జగన్ నంద్యాలలోనే ఉండిపోయి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసినా ప్రజలు టిడిపికి పట్టం కట్టారని వివరించారు. రాయలసీమ తనకు కొత్త కాదని, ఎదురులేదన్న జగన్ వైఖరిని ప్రజలు తిరస్కరించారన్నారు. ఏడుకోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నడిరోడ్డుపై కాల్చేయాలని, ఉరితీయాలని ఉన్మాదిలా మాట్లాడిన జగన్‌ను ప్రజలు గమనించారన్నారు.