ఆంధ్రప్రదేశ్‌

నేడే కాకినాడ కార్పొరేషన్ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 28: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ మంగళవారం జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో 2 లక్షల 29వేల 373 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు 196 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ముందుగా నమూనా పోలింగ్ నిర్వహించి, తర్వాత పోలింగ్ ప్రారంభిస్తారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. నగరపాలక సంస్థలో 50 డివిజన్లున్నాయి. కోర్టు వివాదాల కారణంగా 42,48 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో 48 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 196 పోలింగ్ స్టేషన్లకు గాను కార్పొరేషన్ భవనాల్లో 169 పోలింగ్ కేంద్రాలు, ప్రభుత్వ భవనాల్లో 17, ప్రైవేటు భవనాల్లో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 17మంది తహశీల్దార్లు, ఎంపిడిఒలను రిటర్నింగ్ అధికారులుగాను, మరో 17మందిని సహాయ రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. ఎన్నికలకు 400 ఇవిఎంలను వినియోగిస్తున్నారు. పోలింగ్ నిర్వహణకు రిజర్వ్‌తో కలిపి 258 ప్రిసైడింగ్ అధికారులు, 296 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. 4 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, నాలుగు పర్యవేక్షక బృందాలు, ఏడుగురు జోనల్ అధికారులు, 13 మంది రూట్ అధికారులను నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సిసి కెమేరాలు ఏర్పాటుచేశారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలిస్తారని, పోలింగ్ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సరాసరి 1170 మంది ఓటర్లుంటారని, ప్రతిఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ ఏజంట్లకు క్రమపద్ధతిలో సీట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. స్థానిక రంగరాయ వైద్య కళాశాలలో ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లుచేస్తున్నారు.