ఆంధ్రప్రదేశ్‌

తెలుగులో తీర్పు ఇచ్చిన మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 29: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భీమునిపట్నం నాల్గవ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కె మురళీమోహన్ మంగళవారం తెలుగులో తీర్పు చెప్పారు. 2013 అక్టోబర్ 14న మధ్యాహ్నం రెండు గంటలకు లారీ డ్రైవర్ సీతయ్య లారీని అజాగ్రత్తగా నడిపి రెడ్డిపల్లి గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సమ్మంగి చంటి మరణించాడు. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ కంది సీతయ్యపై ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు భీమిలిలోని నాల్గవ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టుకు వచ్చింది. ముద్దాయిపై ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలను చూపలేకపోవడంతో సీతయ్యను నిర్దోషిగా పేర్కొంటూ న్యాయమూర్తి మురళీ మోహన్ తెలుగులో తీర్పు చెప్పారు.