ఆంధ్రప్రదేశ్‌

అనంతపురంలో ప్లాస్టిక్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 4: అనంతపురం జిల్లాలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో సూక్ష్మ నీటిసాగు కంపెనీల ప్రతినిధులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 150 ఎకరాల్లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సూక్ష్మ సేద్య పరికరాల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాల్సిందిగా కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ నీటి సాగుకు 5.25 లక్షల ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. సూక్ష్మ నీటి సాగు పరికరాలకు సంబంధించి 5 శాతం వ్యాట్‌ను ప్రభుత్వం రైతులకు తిరిగి చెల్లిస్తుందన్నారు. సూక్ష్మ నీటి సేద్య పరికరాలపై జిఎస్‌టి 18 శాతం విధించారని, దీనిని 12 శాతానికి తగ్గించేందుకు కేంద్రంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ పరికరాల విడిభాగాల కేంద్రాలను ప్రారంభించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాల నాణ్యతను నాబ్‌కాన్ ద్వారా తనిఖీ చేస్తామని, లోపాలుంటే ఆయా కంపెనీల నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. బయోమెట్రిక్ ద్వారా 1.09 లక్షల మంది రైతులు సూక్ష్మసేద్య పరికరాల కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ప్రభుత్వ లక్ష్యాన్ని డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని కోరారు.