ఆంధ్రప్రదేశ్‌

ముఖ్యమంత్రి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 4: ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అని, విద్యార్థుల భవిష్యత్తు దిశా నిర్దేశకులు ఉపాధ్యాయులేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివర్ణించారు. తల్లి, తండ్రి ఆది గురువులైనా విద్యార్థుల మానసిక వికాసం గురువు శిక్షణలోనే సాధ్యమవుతుందని, భావితరాలను సమాజానికి అందించేది వారేనని స్పష్టం చేశారు. నైపుణ్యంతో, పరిజ్ఞానంతో కూడిన విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమన్నారు. అధ్యాపక వృత్తికే వనె్నతెచ్చి అత్యున్నతమైన రాష్టప్రతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం సదా స్ఫూర్తిదాయకమని, ఆయన బోధనలు ఎప్పటికీ అనుసరణీయమని అన్నారు. భారతీయ తాత్విక చింతన ఔన్నత్యాన్ని ప్రాక్ పశ్చిమ దేశాలకు చాటిన గొప్ప తత్వవేత్త రాధాకృష్ణన్ అని చంద్రబాబు నివాళులర్పించారు. అధ్యాపకులందరికీ ముఖ్యమంత్రి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.