ఆంధ్రప్రదేశ్‌

ఎస్వీయూలో విద్యార్థుల ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 4: ప్రిన్సిపాల్ ఎదుటే ఇరు వర్గాల విద్యార్థులు ముష్టియుద్ధానికి దిగారు. ప్రిన్సిపాల్ చాంబర్ రణరంగంగా మారింది. పరస్పర దాడులతో ఫర్నిచర్ ధ్వంసమైంది. గాజుపెంకులు తగిలి ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఉంటున్న వసతిగృహాల సమీపంలో ఉన్న క్రికెట్ మైదానం విషయమై ఇంజనీరింగ్ డ్యూయల్ కోర్సు, రెగ్యులర్ కోర్సు విద్యార్థుల మధ్య జరిగిన వివాదం సోమవారం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ప్రిన్సిపాల్ పద్మనాభయ్య సమక్షంలోనే ఆయన చాంబర్‌లో విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. ఈ సంఘటనలో ప్రిన్సిపాల్ చాంబర్‌లోని కుర్చీలు, గాజు డోర్లు ధ్వంసమయ్యాయి. ఈక్రమంలో వారిని అడ్డుకోవడానికి వచ్చిన వర్శిటీ భద్రతా సిబ్బంది మునివేలు, ప్రభాకర్‌లకు గాజుపెంకులు గుచ్చుకుని గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న ఎస్వీయూ పోలీసులు భారీఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈసందర్భంగా అక్కడున్న 200 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఘర్షణకు కారణమైన ఎస్వీయూ కంప్యూటర్ సైన్స్‌లో మూడవ సంవత్సరం చదువుతున్న నితిన్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు సుమోటోగా కేసును నమోదు చేశారు తప్పా, వర్శిటీ అధికారులు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఇదిలావుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితిని చక్కబెట్టే క్రమంలో ప్రిన్సిపాల్ పద్మనాభయ్య హాస్టల్ మెస్‌ను మూసివేయించారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులను ఇళ్లకు పంపించారు. పరిస్థితి చక్కబడేంత వరకు అనుమతించబోమని విద్యార్థులకు స్పష్టం చేశారు.