ఆంధ్రప్రదేశ్‌

ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో ఇసుక రవాణాలో చోటు చేసుకున్న అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిలో మార్పులేకపోతే, తాను రీచ్‌ల్లో తనిఖీలు చేస్తానని అధికారులకు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇసుక విధానం, రవాణా తదితర అంశాలపై చోటు చేసుకుంటున్న ఆరోపణలపై చర్చ జరిగింది. ఉచితంగా ఇసుక అందచేస్తున్నప్పటికీ, ఆమేరకు ప్రజల్లో సంతృప్తి లేకపోవడాన్ని ప్రస్తావించారు. ప్రజలకు ఆ మేరకు ఇసుక తక్కువ ధరకు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోమని ఆదేశించినా, ఆ మేరకు నియంత్రణలోకి రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. అధికారులు తీసుకుంటున్న చర్యల కారణంగా గతంలో కంటే ఇసుక అక్రమ తరలింపు కొంత తగ్గినా, పూర్తిగా అదుపులోకి రావడం లేదన్నారు. ఇసుక రీచ్‌లో మంత్రులూ, సిఎస్, ఇతర అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే తానూ ఇసుక రీచ్‌ల్లో తనిఖీలు చేస్తానని హెచ్చరిక. టాటా కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.