ఆంధ్రప్రదేశ్‌

ఇక ‘ప్రధాన మంత్రి చంద్రన్న బీమా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో అమలు చేస్తున్న చంద్రన్న బీమా పథకం పేరును మార్పు చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రన్న బీమా రెండవ విడత పథకం అక్టోబర్ 2 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకూ అమల్లో ఉంటుందని తెలిపారు. రెండో విడత పథకానికి ప్రధాన మంత్రి చంద్రన్న బీమా పథకంగా పేరు మార్చినట్లు తెలిపారు. ఈ పథకం కింద 8 నెలలకు ప్రీమియం కింద 235 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, 18-70 సంవత్సరాల మధ్య వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులని తెలిపారు. పాలసీదారులు సహజ మరణం పొందితే 2 లక్షల రూపాయలు బీమా కింద అందచేస్తారని తెలిపారు.