ఆంధ్రప్రదేశ్‌

జమునకు నవరస కళావాణి బిరుదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 9: తన జన్మదిన వేడుకల సందర్భంగా అలనాటి ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపి జమునను నవరస కళావాణి బిరుదుతో సత్కరిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. విశాఖలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమున సినీ జీవితంలో డైమండ్ జూబ్లీ నిర్వహించుకుంటున్న సందర్భంగా ఆమెను ఈ బిరుదుతో సత్కరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దత్తత తీసుకున్న విశాఖలోనే ప్రజల మధ్య తన పుట్టినరోజు జరుపుకుంటానన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న సాయంత్రం ఐదు గంటలకు వుడా చిల్డ్రన్ థియేటర్‌లో ఆధ్యాత్మిక ప్రముఖులకు ఘన సత్కారం ఉంటుందన్నారు. 17న సాయంత్రం 4.30 గంటలకు కళావాణి ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమంలో జమునకు నవరస కళావాణి బిరుదుతో సత్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా సర్వధర్మ సమభావన సమ్మేళనం ఉంటుందన్నారు. విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామిజీ, పలువురు మత గురువులు ఇందులో పాల్గొంటారన్నారు. ఇరవై ఏళ్లుగా ప్రతి ఏడాది పుట్టినరోజు సందర్భంగా దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు చెందిన ప్రధాన పూజారులు, మత గురువులు, సినీ నటీ,నటులను ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

చిత్రం..బ్రోచర్‌ను విడుదల చేస్తున్న ఎంపీ సుబ్బరామిరెడ్డి