రాష్ట్రీయం

కోర్టు కేసు వల్లే ‘రామ మందిరం’ జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, సెప్టెంబర్ 10: న్యాయస్థానంలో కేసు ఉన్నందు వల్లే రామమందిరం నిర్మాణంలో జాప్యం జరుగుతోందని కేంద్ర మాజీ మంత్రి, బిజె మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధ్రేశ్వరి తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఆదివారం ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రామమందిరం నిర్మాణంలో హిందువులను మోసగించలేదని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. న్యాయస్థానం తీర్పును బట్టి రామమందిరం నిర్మాణంపై పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ తమ మిత్ర పక్షమని, మిత్ర ధర్మం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల పొత్తు వ్యవహారం కేంద్ర పార్టీ నిర్ణయం మేరకే జరుగుతుందని, కేంద్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేస్తామన్నారు. ఇక రాష్ట్రంలో వైకాపా ప్రతిపక్ష పార్టీగా ఉన్నందు వల్ల ప్రధానమంత్రి మోదీ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కలిసే అవకాశం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.
వెనుకబడిన రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 1,050కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతతో ఖర్చు చేసి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రజల విశ్వాసం పొందాలని సూచించారు. దేశంలో ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులను చంపడం బిజెపి హయాంలో ఎక్కువయ్యాయన్న విమర్శలను ఆమె దృష్టికి తీసుకురాగా శాంతి భద్రతల విషయం రాష్ట్రాలకు సంబంధించినది అన్నారు. ఏది జరిగినా బిజెపిపై నిందలు వేయడం తగదని ఆమె ఆక్షేపించారు. టిడిపికి మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ బిజెపిని విమర్శించడంపై ఆమె మాట్లాడుతూ పవన్ మాటలు వ్యక్తిగతమని కొట్టి పారేశారు. బిసిలకు రాజ్యాంగపరమైన హక్కులను కల్పించి వారిని అభివృద్ధి చేయడమే బిజెపి లక్ష్యమన్నారు.

చిత్రం..ఆదోనిలో విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న బిజె మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధ్రీశ్వరి