ఆంధ్రప్రదేశ్‌

తిరుపతి వైభవాన్ని చాటే ఫొటోలకు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 10: కలియుగ ప్రత్యక్ష దైవంగా కీర్తించబడుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని, చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాన్ని చాటిచెప్పే అపురూపమైన ఫొటోలను కలిగి ఉన్నవారు వాటిని ఈనెల 16వ తేదీలోగా తమకు అందించాలని టిటిడి పిఆర్వో డాక్టర్ తలారి రవి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో టిటిడి ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో నాడు-నేడు పేరుతో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. గత రెండు సంవత్సరాలుగా తిరుమలలోని కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ ఎగ్జిబిషన్‌లో భక్తులను భాగస్వాములను చేస్తూ, భక్తులు అందించిన అపూరూపమైన ఫొటోలను ఈ ప్రదర్శనలో ఉంచుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల, తిరుపతిలోని టిటిడి స్థానిక ఆలయాలు, ఇతర టిటిడి అనుబంధ ఆలయాలకు సంబంధించిన అపురూపమైన, పాత ఫొటోలున్న భక్తులు ప్రజాసంబంధాల అధికారి, టిటిడి పరిపాలనా భవనం, కెటి రోడ్డు, తిరుపతి-517 520 అనే చిరునామాకు పంపించాలని ఆయన కోరారు. కాగా ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో టిటిడి ఛాయాచిత్ర ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యపూజా విధానంలో వివిధ సందర్భాల్లో వినియోగించే పాత్రలు, పూజాద్రవ్యాల ఛాయాచిత్రాల ప్రదర్శనలో ఉంటాయన్నారు. శ్రీవారు ప్రత్యేక పర్వదినాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో పూజలు అందుకునే ఉత్సవమూర్తుల ఫొటోలు భక్త్భివాన్ని పెంచేలా ఆయా ఆంశాలకు సంబంధించి ప్రత్యేకంగా విడివిడిగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. తరతరాల తిరుమల పేరుతో 80 సంవత్సరాల క్రితం శ్రీవారి ఆలయ చరిత్రను కళ్లకుకట్టే అరుదైన ఫొటోలు భక్తులను ఆకర్షిస్తాయని తెలిపారు.