ఆంధ్రప్రదేశ్‌

14నాటికి టీచర్స్ సర్వీస్ రూల్స్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: సెప్టెంబర్ 14వ తేదీ నాటికి ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ సిద్ధం చెయ్యాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఎలాంటి జాప్యం లేకుండా ఉత్తర్వులు విడుదల చెయ్యాలని కూడా నిర్దేశించారు. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ ముసాయిదాపై ఆదివారం కమిటీ సమావేశం విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం మరో రెండు రోజులు గడువునిచ్చి అభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయించారు. సర్వీసు రూల్స్ అమలు చేసినందువల్ల ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగ భద్రతకు ఆటంకం కలగరాదని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు వి బాలసుబ్రహ్మణ్యం, రాము సూర్యారావు కోరారు. అలాగే మోడల్ హైస్కూళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. 1998 నాటి నుంచి సర్వీసు రూల్స్ వర్తిస్తున్నందున ఆనాటి క్యాడర్లు, అర్హతలు, ప్రమోషన్ విధానం మాత్రమే ప్రస్తుత సర్వీసు రూల్స్‌లో సాధ్యమని, తదుపరి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మార్పులు చేసుకోవచ్చని అధికారులు వివరించారు. ఏదిఏమైనప్పటికీ సర్వీసు రూల్స్ సమస్య ఓ కొలిక్కి వస్తున్నందుకు పిడిఎఫ్ ఫ్లోర్‌లీడర్ వి బాలసుబ్రహ్మణ్యం హర్షం వ్యక్తం చేశారు.