ఆంధ్రప్రదేశ్‌

రేపు ఆర్టీసీ ఎన్‌ఎంయు స్వర్ణోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పక్షానికీ అనుబంధం లేకుండా ఏపిఎస్‌ఆర్టీసీలో తిరుగులేని ఘన విజయాలతో వేలాది మంది కార్మికుల అండదండలతో ముందుకు సాగుతున్న నేషనల్ మజ్దూర్ యూనియన్ స్వర్ణోత్సవ వేడుకలు ఈ నెల 12న సాయంత్రం బస్‌స్టేషన్ సమీపంలోని కృష్ణానదీ తీరాన పద్మావతి ఘాట్‌లో వైభవంగా జరుగబోతున్నాయి.
ఈ ఉత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, ఆర్టీసీ ఎండి డాక్టర్ ఎం మాలకొండయ్య, ఎంపిలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావు, జిల్లాకు చెందిన మంత్రులు, స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. బస్‌స్టేషన్‌లోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు సి చంద్రయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పివి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు, ముఖ్య ఉపాధ్యక్షులు డి సూర్యప్రకాశరావు, కార్యదర్శి సుజాత తమ సంఘం సాధించిన విజయాలు వివరించారు. దివంగత పెండ్యాల రామ్మోహనరావు 1967లో స్థాపించిన ఈ సంఘం తొలి రెండేళ్లలోనే 1969లో హైదరాబాద్ నగరంలో గుర్తింపు పొందింది. 1982 నుంచి 2013 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 13సార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగ్గా నేషనల్ మజ్దూర్ యూనియన్ 9సార్లు భారీ మెజార్టీతో గెలవటం అటుంచి రాష్ట్ర విభజన తర్వాత 2016లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లోనూ గెలిచి మొత్తంపై పదిసార్లు విజయపతాకం ఎగురవేసింది.
ప్రత్యేక విశేషం ఏమిటంటే మొదటి నుంచి కూడా ఒంటరిగానే పోరాడుతూ వస్తోంది. ఒక దశలో గుర్తింపు లేనప్పటికీ 2013 వేతన సవరణకు సంబంధించి 2015 మే నెలలో జరిగిన 8రోజుల సమీక్షలో తామంతా పాల్గొని 43 శాతం ఫిట్‌మెంట్ సాధనలో ప్రధాన భూమిక పోషించామని వారు తెలిపారు. గుర్తింపు యూనియన్ తొలిసారిగా 1982లో మెరుగైన వేతన ఒప్పందం, దురదృష్టవశాత్తూ చనిపోయిన కార్మికుల కుటుంబాల కోసం 1982లో ఎస్‌బిటి స్కీం, పెన్షన్ సౌకర్యం లేకపోవటం వల్ల రిటైర్డ్ కార్మికుల కోసం ఎస్‌ఆర్‌బిఎస్, 1989లో ప్రభుత్వ ఉద్యోగుల కంటే మెరుగైన వేతన ఒప్పందం, కారుణ్య నియామకాలు, వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్, అన్ని కేటగిరీల కార్మికులకు మెరుగైన ఇనె్సంటివ్ పథకం, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలతో కూడిన బీమా సౌకర్యం, మెడికల్ అన్‌ఫిట్ అయిన డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు, పదోన్నతులు రాని ఉద్యోగులకు 12, 20 సంవత్సరాలకు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు వంటివి సాధించామని ఎన్‌ఎంయు నేతలు వివరించారు.
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేదెన్నడు?
కార్మిక సంఘాలు పోటాపోటీగా పలు సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నప్పటికీ ప్రధానంగా ప్రస్తుతం 3వేల 600 కోట్ల రూపాయల నష్టాలతో ఉన్న ఆర్టీసీ గట్టెక్కేదెన్నడో అర్థంకాని పరిస్థితి నెలకొంది. గతంలో ఎండి నండూరి సాంబశివరావు, ప్రస్తుత ఎండి మాలకొండయ్య కృషి ఫలితంగా ప్రస్తుతం దుబారా ఖర్చులు తగ్గి నష్టాలు లేకుండా చూడగలుగుతున్నప్పటికీ వడ్డీ కింద రోజుకు కోటి రూపాయల చొప్పున సాలీనా రూ.360 కోట్లు, రుణ బకాయి వాటా కింద రూ.360 కోట్లు విధిగా చెల్లించాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా మూలధనానికి ఏటా కనీసం వంద కోట్లు చొప్పున చెల్లించాల్సి ఉంటే గత 25 ఏళ్లుగా నయా పైసా చెల్లింపులు కూడా జరగలేదు. ఈ కారణంతో సంస్థ మనుగడ కోసం కార్మికులు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సిపిఎస్)లో భద్రపరచుకున్న సొమ్ములో దాదాపు వంద కోట్లను వాడుకోవాల్సి రాగా కష్టకాలంలో కార్మికులకు రుణ సదుపాయం లభించటం లేదని పలువురు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆర్థిక లోటును పూర్తిగా భర్తీ చేస్తేనే సంస్థ మరింతగా ముందుకు సాగుతుందని కార్మిక సంఘాల నేతలు ఆశిస్తున్నారు.