ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో రక్షణ శాఖ కార్యదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: రక్షణ శాఖ కార్యదర్శి సంజయ్ మిత్ర రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖలోని తూర్పు నౌకాదళ కార్యాలయానికి సోమవారం వచ్చారు. రక్షణ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా ఆయన తూర్పు నౌకాదళాన్ని సందర్శించారు. ఢిల్లీ నుంచి విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకున్న మిత్రకు చీఫ్ ఆఫ్ నేవల్ స్ట్ఫా వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంజయ్ మిత్ర తూర్పు నౌకాదళ అధికారి వైస్ అడ్మిరల్ హెచ్‌సిఎస్ బిస్త్‌తో సమావేశమయ్యారు. తూర్పు నౌకాదళ కార్యకలాపాల గురించి సంజయ్ మిత్రకు, బిస్త్ వివరించారు. తూర్పు నౌకాదళంలో ఉన్న వౌలిక సదుపాయాలను పరిశీలించనున్నారు. అలాగే ఐఎన్‌ఎస్ కళింగ, డేగ, శాతవాహన, మెటీరియల్స్ ఆర్గనైజేషన్స్, నేవల్ డాక్‌యార్డ్, స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ శివాలిక్‌ను సంజయ్ మిత్ర సందర్శించనున్నారు.

చిత్రం..రక్షణ శాఖ కార్యదర్శికి ఐఎన్‌ఎస్ డేగాలో స్వాగతం పలుకుతున్న తూర్పు నౌకాదళ అధికారి బిస్త్