ఆంధ్రప్రదేశ్‌

మళ్లీ పరిపాలించే శక్తి ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 11: డబ్బై ఏళ్ళుగా జరగని అభివృద్ధి మూడేళ్ళలో చేసి చూపించాను.. 2014లో అన్యాయంగా విభజన జరిగింది.... కట్టుబట్టలతో పంపేశారు.. మూడేళ్ళుగా రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాను... ‘ప్రజలే ముందు’ మంత్రంగా పాలిస్తున్నాను... మళ్లీ పరిపాలించే శక్తి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజల ఆశీర్వాదం కోసమే శ్రీకాకుళం నుంచే ‘ఇంటిఇంటికీ తెలుగుదేశం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానంటూ సోమవారం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం వీరఘట్టాం మండలంలో తెట్టంగి గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మండుటెండలో అలజంగి చిట్టెమ్మను, ఆమె కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కిమిడి మోహనరావు, అమ్మడమ్మ ఇంటిలోపలికెళ్లి వారి ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వ సహాకారం అందుతున్నది లేనిది తెలుసుకున్నారు. పక్కనే గల పాన్‌షాపులో గ్లూకోజ్ వాటర్ తాగిన ముఖ్యమంత్రి కిమిడి మోహనరావుకు 500 రూపాయలు ఇచ్చారు. ఇలా ఆరు గడపలకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జరగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇంటింటికీ టిడీపీ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందన్నారు. చైతన్యవంతమైన సిక్కోల్ జిల్లా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు ఎంతో ప్రీతిపాతమైన జిల్లాగా పేర్కొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న జిల్లాకావడంతో చైతన్యవంతమైందన్నారు. ముందుగా ఇంటింటికీ టిడీపీని గ్రామదేవత బంగారమ్మ తల్లి ఆలయంలో పూజ చేసి ప్రారంభించడంతో తన భవిష్యత్తు విజయం కన్పించిందన్నారు. రాష్ట్రాన్ని చల్లగా చూడమని కోరానని, ఆమె సాక్షిగా మీ కోసం పనిచేస్తానని ప్రమాణం చేసారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 1.6 శాతం తేడాతో విజయం సాధించిన తాము నంద్యాల ఎన్నికల్లో 16 శాతం, కాకినాడ ఎన్నికల్లో 16 శాతం ఓట్ల తేడాతో దిగ్విజయం సాధించామన్నారు. ప్రతిపక్షం ఈ ఎన్నికలపై ధనప్రభావం చూపించిందని దుష్ప్రచారం చేస్తోందన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 175 టిడిపి గెలవాలన్నదే లక్ష్యంగా నాయకత్వం పనిచేయాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులపై అడ్డంపడ్డ పార్టీని అడ్రస్ లేకుండా చేయాలన్నారు. రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పినవారంతా ముక్కున వేలేసుకున్నారని, ఆర్‌బిఐ, బ్యాంకులు సహకరించనప్పటికీ రూ. 24000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ మాఫీని కాపీ కొట్టాయన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేదు..కాని పేదోళ్ళకు సహాయం చేయాలన్న మనసు ఉండడంతోనే ఇవన్నీ సాఫీగా సాగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజల భారాన్ని తాను మోస్తున్నానని, అందుకు మీరు రుణంగా ఏకపక్షంగా ఓట్లు వేసి టిడిపిని గెలిపించాలన్నారు. 2014 ముందు 22 మిలియన్ వాట్ల విద్యుత్ కొరతతో రాష్ట్రాన్ని అంధకారం చేసి అప్పగించారని, ఇప్పుడు ఉచితంగా విద్యుత్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్లామన్నారు. బూత్ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు ఏర్పాటు చేసి, సామాజిక బాధ్యత కలిగిన డ్వాక్రా సంఘాలను అనుసంధానం చేస్తే 90 లక్షల మంది డ్వాక్రా మహిళలు, 65 లక్షల మంది టిడీపీ సభ్యులు కలిసిన కుటుంబం రానున్న ఎన్నికల్లో పని చేస్తుందన్నారు.

చిత్రాలు..శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం తెట్టంగిలో ఇంటింటికి టిడిపి నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు