ఆంధ్రప్రదేశ్‌

కులాలపై వైసీపీ కన్ను?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 11: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఒకే సామాజికవర్గానికి పట్టం కడుతున్నారన్న ప్రచారాన్ని నిదర్శనాలతో సహా నిరూపించేందుకు ప్రతిపక్ష నేత వైసీపీ సిద్ధమవుతోంది. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రెడ్డి సామాజికవర్గానికి ఎనె్నన్ని పదవులు కట్టబెట్టారన్న జాబితాను నాటి ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి విడుదల చేయగా, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా అదే వ్యూహం అనుసరించనుంది. అయితే, అప్పుడు టిడిపి కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు, చైర్మన్లకే పరిమితమవుతే ఇప్పుడు వైసీపీ మరో పది అడుగులు ముందుకేసి, అసెంబ్లీ నుంచి వివిధ శాఖలకు చెందిన కన్సల్టెంట్లు, ప్రభుత్వ ప్లీడర్లు, అడ్వకేట్ జనరల్, స్టాండింగ్ కౌన్సిళ్ల వరకూ కమ్మ సామాజికవర్గానికే పట్టం కడుతున్న తీరును మిగిలిన సామాజికవర్గాల దృష్టికి తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. పార్టీ వర్గాల సమాచారం.. టిడిపి ప్రభుత్వం గత మూడున్నరేళ్ల నుంచి పై నుంచి కింది స్థాయి వరకూ జరిపిన వివిధ నియామకాలు, అంతకుముందు అందులో కొనసాగిన ఇతర సామాజికవర్గాలను తొలగించి, వారి స్థానంలో సొంత సామాజికవర్గానికి చెందిన వారిని నియమించిన తీరును వివరాలతో సహా వెల్లడించనుంది. ‘అడ్వకేట్ జనరల్‌గా ఉన్న వేణుగోపాల్‌ను రాజీనామా చేయించి, ఆ స్థానంలో వాళ్ల సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఆ పదవి ఇచ్చారు. ఇప్పుడు పిపిలు, స్టాండింగ్ కౌన్సిళ్ల సభ్యులుగా మెజారిటీ శాతం మళ్లీ అదే కులం వారిని కొనసాగిస్తున్నారు. ఆ లెక్కలన్నీ తీశాం. ఈ బాధ్యత మా లీగల్ సెల్ ఇప్పటికే వేగంగా నిర్వర్తిస్తోంద’ని ఓ నేత వెల్లడించారు. ముఖ్యంగా కోస్తాలో కీలకమైన పదవులు, అధికారుల నియామకాలు, అమరావతిలో ఆ సామాజికవర్గానికి చెందిన సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు, పోలీసు, రెవిన్యూ, మున్సిపల్, విద్యుత్, ఐటి, ఆర్ అండ్ బి, న్యాయ, పంచాయతీరాజ్ శాఖల్లో ఆ వర్గానికి ఇచ్చిన పోస్టింగులు, కట్టబెట్టిన కాంట్రాక్టుల వివరాలను సేకరించే పనిలో ఉంది. ‘కోస్తాలో టిడిపి సామాజికవర్గ హవాకు మిగిలిన కులాలు నష్టపోతున్నాయన్న భావన అందరిలో ఉంది. విజయవాడ, గుంటూరులోనే కాదు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలన్నీ చిత్తూరు జిల్లాకు చెందిన వారికే కట్టబెడుతున్నారు. అందులో సీఎం బంధువు, మిత్రుడి కంపెనీ కూడా ఒకటి ఉంది. అన్ని దేవాలయాల సెక్యూరిటీ, ప్రభుత్వ ఆసుపత్రుల ఉద్యోగ నియామకాలన్నీ ఆ కంపెనీకే ఇచ్చారని ఓ నాయకుడు వెల్లడించారు. కీలకమైన పోస్టింగులేవీ తమకు దక్కడం లేదని, ఒకవేళ దక్కినా తమను అక్కడ ఎక్కువరోజులు ఉండనీయడం లేదని ఇతర కులాలకు చెందిన చాలామంది అధికారులు మొరపెట్టుకుంటున్నారని చెప్పారు. ‘మేం అలాంటి వాళ్ల జాబితా తీసుకుంటున్నాం. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లు మేం గమనించినా చాలారోజులు వేచిచూసే ధోరణి ప్రదర్శించాం. ఇక ఇప్పుడు దానిని ప్రజల దృష్టికి తీసుకువెళ్లే సమయం వచ్చింది. ఆ సామాజికవర్గం వల్ల పోస్టింగులు, అవకాశాలు పొగొట్టుకున్న వారి జాబితా బయటపెడతామ’ని వైసీపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
అయితే, దీనిని నేరుగా మీడియా ముఖంగా వెల్లడించాలా? లేక సోషల్ మీడియ ద్వారా ఇతర సామాజికవర్గాల వారి వద్దకు వెళ్లాలా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఇందుకోసం వైసీపీ నేతలు సెక్రటేరియేట్, కమిషనరేట్ స్థాయి అధికారులు, కొందరు మీడియా ప్రముఖులను ఇప్పటికే సంప్రదిస్తుండటం ప్రస్తావనార్హం.