ఆంధ్రప్రదేశ్‌

నిషిద్ధ యాంటీబయాటిక్స్ వాడితే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: ఆక్వా సాగులో నిషేధిత యాంటీబయాటిక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను కాదని ఎవరైనా వాడితే కఠినచర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై రైతులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఆక్వా సాగులో నిషేధిత యాంటి బయోటిక్స్‌పై సముద్ర ఉత్పత్తులు, ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపిఇడిఎ) అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నిషేధిత యాంటీబయాటిక్స్ వినియోగానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. ఈ విషయమై ఈనెల 16వ తేదీన విజయవాడలో రాష్టస్థ్రాయి సమావేశం నిర్వహించనున్నామన్నారు. రాష్ట్రంలో గుర్తించిన 199 క్లస్టర్లలో ఉన్న 1,248 గ్రామాల్లో ఆక్వా రైతులతో అక్టోబర్ 4 నుంచి 24 తేదీ వరకూ చైతన్య సదస్సులు నిర్వహించనున్నామన్నారు. కొత్త చెరువుల పునరుద్ధరణకు అవసరమైన రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేక డ్రైవ్ అక్టోబర్ 25 తేదీ నుంచి 31 వరకూ ఆరు జిల్లా కేంద్రాల్లో చేపట్టనున్నామన్నారు. చేపల చెరువుల ఏర్పాటుకు అవసరమైన రిజిస్ట్రేషన్లకు త్వరితంగా అనుమతులివ్వాలన్నారు. పాత చెరువులకు రెన్యువల్స్ కూడా పూర్తిచేయాలన్నారు. ఆక్వా ల్యాబ్‌ల్లో చేపల ఆహారాన్ని పరిశీలించాలన్నారు. సమీక్షా సమావేశంలో ఎంపిఇడిఎ చైర్మన్ డాక్టర్ ఎ.జయత్ తిలక్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ జాయింట్ కార్యదర్శి ఎస్‌కె సారంగి, ఫిషరీస్ కమిషనర్ రామ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.