ఆంధ్రప్రదేశ్‌

ఒలింపిక్స్‌కు ఏపీ వేదిక కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, (స్పోర్ట్స్) సెప్టెంబర్ 11: ఒలింపిక్స్ నిర్వహించడానికి తగిన క్రీడా సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలన్నదే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఇక్కడి నోవాటెల్ హోటల్‌లో సోమవారం జరిగిన ఇండియన్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ స్నూకర్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ స్నూకర్ క్రీడలకు 2003లో హైదరాబాద్‌లో స్థలాన్ని కేటాయించామని, ఇపుడు అక్కడ అద్భుతమైన అకాడమీ నిర్వహిస్తున్నారన్నారు. కొత్త రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, అమరావతి ప్రాంతాల్లో అద్భుతమైన క్రీడా సదుపాయాలతో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలనేది తన అభిలాషగా పేర్కొన్నారు. పుల్లెల గోపీచంద్‌కు కూడా బ్యాడ్మింటన్ అకాడమీ కోసం స్థలం కేటాయించామని, ప్రస్తుతం ఆ అకాడమీ అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడంలో ముందు ఉందన్నారు. స్నూకర్ క్రీడ ధనికులు ఆడే ఆట అనేది నిజం కాదని ప్రపంచంలో 40 మిలియన్ల మంది క్రీడాకారులు ఈ ఆటను ఆడుతున్నారని చెప్పారు. దేశంలో క్రికెట్‌కు ఎక్కువ ఆదరణ ఉందని, క్రికెట్‌తోపాటు మిగిలిన క్రీడలకు కూడా ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతిలో స్నూకర్ క్రీడకు స్థలాన్ని ఇచ్చి ప్రోత్సహిస్తామని, 2029 నాటికి ప్రపంచంలోనే అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడానికి అనువైన ప్రాంతంగా నెంబర్ 1 స్టేట్‌గా ఏపీకి గుర్తింపు తీసుకువస్తామన్నారు. ఏడాదిలో 365 రోజులు రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట క్రీడలు నిరంతరం జరిగేలా ప్రోత్సహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్టమ్రంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, వరల్డ్ స్నూకర్ ఫెడరేషన్ వైస్-చైర్మన్ నిగిల్ మాయర్, జాతీయ స్నూకర్ సమాఖ్య అధ్యక్షుడు పివికె మోహన్, సీనియర్ నటి పూనంకౌర్ అతిథులుగా పాల్గొన్నారు. చివరిగా ఆస్ట్రేలియాకు చెందిన కెన్‌డూ హార్టి స్నూకర్‌లో చేసిన విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

చిత్రం.. స్నూకర్ ఆడి పోటీలను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు