ఆంధ్రప్రదేశ్‌

సీమలో అన్ని సీట్లూ టిడిపివే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుంటే అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతిపక్ష వైకాపా నాయకులు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో రాయలసీమలో అన్ని స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరటం ఖాయమన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రాయలసీమ అభివృద్ధిని విస్మరించాయని, పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదని అన్నారు.
ముఖ్యంగా ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని సోమవారం ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాయలసీమ త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నదన్నారు. మూడేళ్లలో ముచ్చుమర్రి, గండికోట ఎత్తిపోతల పథకాలు వంటి ఎన్నో ప్రాజెక్టులను పూర్తిచేశాం.. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమకు గతేడాది 120 టిఎంసిల సాగునీటిని అందించామన్నారు. ఈ ఏడాది నాటికి పూర్తయ్యే 28 సాగునీటి ప్రాజెక్టుల్లో రాయలసీమకు చెందిన 13 ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. మూడున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.44వేల కోట్లు ఖర్చుచేశామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గండికోట ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు రూ.479 కోట్లు పరిహారం చెల్లించి చరిత్రలో మొదటిసారిగా పులివెందులకు నీళ్లు ఇచ్చిందన్నారు. రాయలసీమలో పలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులను ఆదుకున్న చంద్రబాబునాయుడు అపర భగీరథుడిగా పేరు గడిస్తే పట్టిసీమకు అడ్డుపడ్డ జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలారంటూ ఎద్దేవా చేశారు.
కృష్ణానదిలో మిగులు జలాలపై హక్కు కోరబోమని గతంలో వైఎస్ ప్రభుత్వం ట్రిబ్యునల్‌కు లేఖ ఇచ్చి రాయలసీమ గొంతు కోసిందన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపికి ప్రజలు బ్రహ్మరథం పట్టడాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షం తన అక్కసును వెళ్లగక్కుతోందని, 2019 ఎన్నికల్లో రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల్లో టిడిపి జెండా ఎగరటం ఖాయమన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రతిపక్షాన్ని బంగాళాఖాతంలో కలుపటం ఖాయమన్నారు.