ఆంధ్రప్రదేశ్‌

రాజధాని డిజైన్లపై తుది నిర్ణయమేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: మూడున్నరేళ్లయినా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంకా డిజైన్లపై తుది నిర్ణయం తీసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని వైకాపా అధికార ప్రతినిధి పార్థసారథి ధ్వజమెత్తారు. గురువారం ఇక్కడ విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు శంకు స్ధాపనలు, ప్రారంభోత్సవాలు, హారతులు, అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ప్రజలను ఇలా ఎంతకాలం మోసం చేస్తారన్నారు. రాజధాని అమరావతికి వైకాపా ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. రాజధాని ముసుగులో చేస్తున్న అవినీతిపైనే తాము నిలదీస్తున్నామన్నారను. ప్రపంచ స్ధాయి రాజధానిలో నవ నగరాల నిర్మాణం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రణాళిక లేకుండా ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 90వేల కోట్ల అప్పుంటే, దాన్ని చంద్రబాబునాయుడు రూ.2.25లక్షల కోట్లకు అదనంగా పెంచారన్నారు.