ఆంధ్రప్రదేశ్‌

పోర్టు నెట్‌వర్క్ హ్యాక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ నెట్‌వర్క్ కుప్పకూలింది. ఈ ఘటన జరిగి 20 రోజులైనా యాజమాన్యం గోప్యంగా ఉంచింది. సుమారు 20 రోజుల కిందట పోర్టు నెట్‌వర్క్ స్తంభించింది. ఇప్పటికే దేశంలోని మేజర్ పోర్టుల్లో భద్రతను పెంచుతున్న నేపథ్యంలో విశాఖ మేజర్ పోర్టులో నెట్‌వర్క్ కుప్పకూలడం పట్ల అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ పోర్టులో భద్రతా చర్యలను ముమ్మరం చేస్తున్నామని పోర్టు చైర్మన్ కృష్ణబాబు చెబుతున్నా, ఎవరూ ఊహించని రీతిలో నెట్‌వర్క్ స్తంభించింది. విశాఖ పోర్టు ట్రస్ట్‌లో నెట్‌వర్కింగ్ చూసే విభాగం నుంచి పోర్టు నెట్‌వర్క్‌లోకి వైరస్ ప్రవేశించినట్టు తెలిసింది. ఒక్కసారిగా పోర్టు నెట్‌వర్క్ నిలిచిపోవడానికి ఉన్న కారణాలను పరిశీలించారు. నెట్‌వర్క్ విభాగంలో పనిచేస్తున్న ఓ ఇంజనీర్ ల్యాప్‌టాప్ నుంచి ఈ వైరస్ పోర్టు నెట్‌వర్క్‌లోకి చొరబడిందని తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యాజమాన్యం పోర్టులోని సర్వర్‌ను షట్‌డౌన్ చేసింది. కంప్యూటర్ ద్వారా జరిగే కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. సైబర్ నేర పరిశోధనా నిపుణులను రప్పించి, దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. సుమారు 20 రోజుల నుంచి దర్యాప్తు చేస్తున్నారు.