ఆంధ్రప్రదేశ్‌

వృద్ధుల సంక్షేమానికి చేయూతనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 17: జనాభాలో 10 శాతానికి పైగా ఉన్న వయోవృద్ధులను స్ర్తి, శిశు సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తొలగించి ప్రత్యేక కార్పొరేషన్, కమిషన్, లేదా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆదివారం నాడిక్కడ హోటల్ ఐలాపురంలో జరిగిన సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర సదస్సు డిమాండ్ చేసింది. కృష్ణా జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, హెల్పేజ్ ఇండియా, వృద్ధమిత్ర సంయుక్త ఆధ్వర్యంలో రోజంతా జరిగిన ఈ సదస్సులో సీనియర్ సిటిజన్స్‌కు సంబంధించిన వివిధ చట్టాలు, వాటి అమలు, వృద్ధులపై వేధింపులు, కుటుంబ సంబంధాలు, ఆరోగ్య సమస్యలు, వృద్ధాశ్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆపై కొన్ని తీర్మానాలు ఆమోదించారు. ఈ సదస్సులో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకరరావు, నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, జాయింట్ పోలీస్ కమిషనర్ బివి రమణకుమార్, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావు ప్రసంగించారు. తల్లిదండ్రుల పోషణ, వృద్ధుల సంక్షేమ చట్టం-2007ను పకడ్బందీగా అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని, రివర్స్ మార్ట్‌గేజ్ స్కీమ్‌ను అమలుచేయాలని, వృద్ధుల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించాలని, వేధింపుల నుంచి కాపాడాలని, జనరిక్ మందులను అందుబాటులో ఉంచాలని, ప్రతి జిల్లా కేంద్రంలో 150 పడకలతో ఆధునిక వైద్య సదుపాయాలు, నర్సింగ్ ఎయిడ్‌తో కూడిన వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. మండల కేంద్రాలు, మున్సిపల్ డివిజన్లలో వృద్ధుల రిక్రియేషన్ కోసం డే-కేర్, ఫిజియోథెరపీ సెంటర్లు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ప్రత్యేక క్యూలు, ర్యాంప్‌లు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వ్‌డ్ సీట్లు పెంచాలని, వృద్ధాప్య పెన్షన్‌ను రూ. 2వేలకు పెంచాలని, ప్రత్యేక వైద్య విధానాన్ని ప్రకటించాలని, వృద్ధులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వాలని, అక్టోబర్ 1 ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని, డిపాజిట్లపై వడ్డీరేటు పెంచాలని, ప్రధానంగా వృద్ధుల సమస్యలపై నిపుణులతో ఓ అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలని సదస్సులో తీర్మానించారు.