ఆంధ్రప్రదేశ్‌

22 బస్ డిపోల్లోనే ఆర్టీసీకి లాభాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 17: జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్ర విభజన అనంతరం ఏపిఎస్ ఆర్టీసీ ఆదిలోనే 2వేల 600కోట్ల రూపాయలకు పైగా అప్పులను తన నెత్తిన వేసుకోవాల్సి వచ్చింది. తాజాగా 3వేల 600కోట్ల రూపాయల నష్టాలతో దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు ముందుకు సాగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపిఎస్ అధికారి నండూరి సాంబశివరావు, ప్రస్తుతం ఎం మాలకొండయ్య ప్రవేశపెట్టిన సంస్కరణలు, పెంచిన వాణిజ్య, వ్యాపార లావాదేవీల కారణంగా ఖర్చులు గణనీయంగా తగ్గటంతో నష్టాలు తగ్గినప్పటికీ లాభాలు మాత్రం పెరగటం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు మాసాల్లో అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు జరిగిన ఆడిట్‌ను పరిశీలిస్తే ఎంత పొదుపు పాటించినప్పటికీ సంస్థ 60కోట్ల రూపాయల మేర నష్టాల్లో ఉంది. అయితే గుడ్డిలో మెల్లగా 2016 జూలై మాసాంతానికి దాదాపు రూ. 100కోట్లు నష్టం ఉంటే ప్రస్తుతం ఆది రూ. 40కోట్లకు తగ్గింది. గడచిన ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు మాసాల్లో బస్సులన్నీ 58కోట్ల కి.మీలు తిరిగితే ఈ ఏడాది 54కోట్ల కి.మీటర్లే తిరిగినప్పటికీ గతం కంటే ఆదాయం కోటీ 40 లక్షలకు పెరిగింది. నాడు ఆర్జించిన ఆదాయం కోటీ 76 లక్షలు అయితే, ఈ ఏడాది కోటీ 90 లక్షలు రావటంతో రూ. కోటీ 35 లక్ష లు ఆదాయం పెరిగింది. ఇక ఖర్చులు గతంలో 2కోట్ల 7లక్షలు అయితే ఈ ఏడాది కోటీ 99 లక్షలు మాత్రమే. దీనివల్ల ఖర్చులు 72 లక్షల రూపాయల మేర తగ్గాయి. ఇక లాభనష్టాలు బేరీజు వేసుకుంటే గత ఏడాది నష్టం 3కోట్ల 5లక్షల రూపాయలు కాగా, ఈ ఏడాది రూ.99 లక్షలు. అంటే నష్టాన్ని 2కోట్ల రూపాయలకు పైగా తగ్గించినప్పటికీ మొత్తంపై సంస్థ నష్టాల్లోనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గడచిన 25ఏళ్లుగా చెల్లించకుండా నిలిపిన షేరు ధనం ఏటా కనీసం వంద కోట్ల రూపాయల చొప్పున మొత్తం బకాయి చెల్లిస్తే ఆర్టీసీకి పూర్వవైభవం చేకూరుతుంది. లేకపోతే అధికారులు, కార్మికులు ఎంతగా శ్రమించినప్పటికీ అప్పులు తీర్చటానికి బస్సులు తిరిగినా, తిరుగకపోయినా రోజుకు కనీసం 2కోట్ల రూపాయలు చొప్పున సాలీనా రూ.700 కోట్లకు పైగా చెల్లించాల్సి వస్తుండటంతో ఆర్టీసీ మనుగడ రానురాను ప్రశ్నార్థకంగా మారుతోంది.
ఇదిలావుంటే రాష్ట్రంలోని మొత్తం 128 ఆర్టీసీ డిపోల్లో కేవలం 22 డిపోలు మాత్రమే గత నాలుగు మాసాల్లో రూ.38 కోట్ల లాభాలతో నడుస్తున్నాయి. లాభాల్లో కృష్ణా జిల్లా విజయవాడ డిపో 8కోట్ల రెండు లక్షల రూపాయలతో ప్రథమ స్థానంలో, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డిపో 3కోట్ల 39 లక్షలు, కాకినాడ డిపో రూ.3కోట్ల 24 లక్షలు, ప్రకాశం జిల్లా కనిగిరి డిపో రూ.2కోట్ల 51లక్షలతో, కృష్ణా జిల్లా ఆటోనగర్ డిపో రూ.2కోట్ల 47 లక్షలతో, రాజమండ్రి డిపో రూ.2 కోట్ల 11 లక్షలతో, కడప డిపో కోటీ 87 లక్షలతో, కర్నూలు డిపో కోటీ 60 లక్షలతో, విశాఖ డిపో కోటీ 53 లక్షలతో, అలిపిరి డిపో కోటీ 45 లక్షల లాభాలతో వరుసగా తొలి 10 స్థానాల్లో నిలిచాయి. నష్టాల్లో రూ.2 కోట్ల 58 లక్షలతో రాయచోటి డిపో ప్రథమ స్థానంలో ఉంది.
ఇ-ఆఫీస్ ద్వారా కాగిత రహిత ఫైళ్ల నిర్వహణ
దేశంలోని రవాణా సంస్థల్లో తొలిసారిగా ఏపిఎస్‌ఆర్టీసీలో ఈ నెల 1 నుంచి తొలిగా కేంద్ర కార్యాలయం ఆర్టీసీ భవన్‌లో కాగిత రహిత కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం సంస్థ ఎండి మాలకొండయ్య కొన్ని మాసాలుగా అన్ని విభాగాల్లోనూ సిబ్బందికి శిక్షణ ఇప్పించారు. రెండో దశలో నవంబర్ నుంచి డిపో స్థాయి వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇ-ఆఫీస్ అమలు వల్ల ఫైళ్లు ఏ దశలో ఉన్నాయో, ఏ అధికారి వద్ద ఉన్నాయో ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా తక్షణం తెలుసుకునే వీలుంటుంది. దీనివల్ల అనవసర జాప్యం నివారించవచ్చని అధికారులు ఆశిస్తున్నారు.