ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా కోసం అవసరమైతే రాజీనామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 18: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తమ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తమ ఎంపి పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తిరుపతి పార్లమెంటు సభ్యుడు వరప్రసాద్ వెల్లడించారు. సోమవారం ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే గట్టిగా పోరాడుతోందని గుర్తుచేశారు. పార్లమెంటులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తమ వాణిని వినిపించేందుకే రాజీనామాలు చేయలేదని, అధిష్ఠానవర్గం అవసరం అనుకుంటే రాజీనామాలు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బకింగ్‌హాం కెనాల్, కోస్టల్ కారిడార్ పనులు ముందుకు సాగడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు కొన్ని వర్గాలకే పరిమితమవుతున్నాయని ఆయన విమర్శించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాల్లో 50 శాతం లోపే ఆర్థికాభివృద్ధి ఉందన్నారు.