ఆంధ్రప్రదేశ్‌

పడకేసిన వైద్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: రాష్ట్రాన్ని జ్వరాలు చుట్టుముట్టాయి. మలేరియా, డెంగీ, చికున్ గున్యా, వైరల్ జ్వరాల రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో మలేరియా, పట్టణ ప్రాంతాల్లో వైరల్, డెంగీ జ్వరాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. జ్వరపీడితులకు మెరుగైన వైద్య సహాయం అందించాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది. యుద్ధప్రాతిపదికన వైద్య సేవలు అందించాల్సి ఉండగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, వివిధ జ్వరాలతో మృతుల సంఖ్య తక్కువగా ఉందంటూ తన అసమర్థతను కప్పిపుచుకునే యత్నం ఆ శాఖ చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని వైద్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరాల్సి రావడం ఆర్థిక భారంగా పరిణమిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖపై సిఎం చేసిన సమీక్షల్లో ఆ శాఖ పనితీరుపై చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేయడం ఆ శాఖ పనితీరుకు అద్దం పడుతుంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గిరిజన ప్రాంతాలైన పాడేరు, అరకు, రంపచోడవరం, సీతంపేట, పార్వతీపురం తదితర చోట్ల మలేరియా తీవ్ర రూపం దాల్చింది. అనధికారిక లెక్కల ప్రకారం ఇటీవల కాలంలో దాదాపు 140 మంది మలేరియా, జ్వరాల బారిన పడి మృతి చెందినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా గిరిజన ప్రాంతాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అధికారులు చెప్పే అంకెలకు, క్షేత్ర స్థాయి బాధితుల సంఖ్యకు పొంతన లేకపోవడం గమనార్హం. చాపరాయి మృతుల ఘటనపై ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక పట్టణ ప్రాంతాల్లో వైరల్, డెంగీ, చికున్‌గున్యా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ప్రకాశం జిల్లా సహా రాజధాని అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. గంటూరులో నాలుగు రోజుల క్రితం ఒకే రోజున 52 డెంగీ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తుంది. ప్రకాశం జిల్లాల్లో డెంగీ కేసుల సంఖ్య ఇప్పటికి 250కి చేరుకుంది. ప్రకాశం జిల్లాలో 23 మంది చనిపోగా, అవి డెంగీ అనుమానిత మరణాలుగా అధికారులు గుర్తించారు. విజయవాడలో కూడా డెంగీ కేసులు సంఖ్య ఎక్కువగా నమోదు అవుతున్నాయి. డెంగీ నిర్ధారణను ప్రభుత్వ వైద్యశాలల్లోనే చేయాలన్న నిబంధన కారణంగా చాలా కేసులు వెలుగుచూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ నుంచి రక్షణ పేరుతో ఈ కేసుల సంఖ్యను తగ్గించి చూపే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. డెంగీ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అయితే, దాని ప్రభావం పర్యాటక రంగంపై పడుతుందని , భావించి, ఈ కేసులు ఎక్కువగా నమోదు చేయడంలో వ్యవహారాలు నడుస్తున్నాయనవచ్చు. వివిధ రకాల జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, మంత్రి, అధికారులు కేవలం సమీక్షలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. చాపరాయి ఘటన నేపథ్యంలో అధికార యంత్రాంగం, మంత్రి కదిలినా, ఆ తరువాత పరిస్థితి షరా మామూలే. సిఎం మందలించినా, ఆ శాఖలో మార్పు లేకపోవడం గమానార్హం. వేల సంఖ్యలో జ్వరపీడితులు ఉండగా, ఆసుపత్రుల్లో అరకొరగా వైద్య సేవలు అందుతున్నాయి. ఇన్‌పేషెంట్లుగా చేరిన వారికి బెడ్స్ అందుబాటులో లేని పరిస్థితి కడప తదితర జిల్లాల్లో నెలకొంది. ఇక మందులు కూడా అంతంతమాత్రంగా అందుబాటులో ఉండటంతో గత్యంతరం లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేని వైద్యులు రోగుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలను సిఎం ఆరోగ్య కేంద్రాలుగా మార్చినప్పటికీ, రోగులు పెద్దగా రాని పరిస్థితి. ప్రతి సమీక్షలోనూ మంత్రి ఒపి పెంచాలని చెప్పడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. సరైన వైద్య సౌకర్యం లేకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. వైద్య సేవల తీరుపై ఐవిఆర్‌ఎస్ విధానం ద్వారా సర్వే చేయడంపై సిఎం దృష్టి సారించాల్సి ఉంది.