ఆంధ్రప్రదేశ్‌

ఎసిబి వలలో అసిస్టెంట్ జియాలజిస్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 19: గనులు, ఖనిజ శాఖలో అసిస్టెం ట్ జియాలిజిస్టుగా పనిచేస్తున్న బట్టు హనుమంతురావు మం గళవారం రాత్రి ఇక్కడి ఒక హోటల్‌లో ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సెంట్రల్ ఇన్విస్టిగేషన్ యూని ట్-అవినీతి నిరోధకశాఖ, అమరావతి అధికారుల బృందానికి దొరికిపోయాడు. విశాఖపట్నం జిల్లా ఎండాడకు చెందిన ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీకి చెందిన యజమాని శ్రీకాకుళం జిల్లా నుంచి ఇసుక తరలించేందుకు రీచ్ అనుమతులు కోసం దరఖాస్తు చేసుకోగా ఏడు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ, ఐదు లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు. దీంతో అమరావతి ఎసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు. రాష్ట్ర అవినీతినిరోధక శాఖ డిజి ఠాగూర్‌కు బాధితుడు నేరు గా ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాలతో సిఐయు రంగంలో దిగింది. అమరావతి నుంచి ఎసిబి డిఎస్పీ ప్రసాద్‌తోపాటు ఇన్‌స్పెక్టర్లు తిలక్, వెంకటేష్, మహేశ్వరరావు, అప్పారావుల బృందం నిందితుడిని పట్టుకున్నారు.