ఆంధ్రప్రదేశ్‌

కలెక్టరేట్‌లో సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 23 : పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని కలెక్టరేట్‌లో సోమవారం ఒక వ్యక్తి వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. అయితే పోలీసులు సకాలంలో స్పందించి అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి పెనుమంట్ర మండలం భట్లమగుటూరు గ్రామ సర్పంచ్ భర్త కావడం గమనార్హం. వివరాలిలావున్నాయి... భట్లమగుటూరు గ్రామ సర్పంచ్ అనిత భర్త ఈది ప్రవీణ్ సోమవారం వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి క్యూలైన్‌లో నిల్చుని, ఒక్కసారిగా తనతో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన పోలీసులు అతడిని నిలువరించారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్ అతడికి కౌనె్సలింగ్ చేయాలని ఆదేశాలిచ్చారు. అతన్ని ఏలూరు త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రవీణ్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం గ్రామంలో రూ.41 లక్షలతో మంచినీటి ట్యాంకు నిర్మించామని, దాన్ని ఇంత వరకు ప్రారంభించలేదని తెలిపారు. కాగా ట్యాంకు నుంచి నీరు సరఫరా అయ్యేందుకు పైపులైన్ల ఏర్పాటుకు అయిదు లక్షల రూపాయలు అవసరమవుతాయని, అయితే ఇంత వరకు దానికి సంబంధించిన గ్రాంటు విడుదల కాలేదని పేర్కొన్నారు. సంవత్సరం నుంచి ఈ నిధుల కోసం నాయకుల చుట్టూ తిరుగుతున్నామని, అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. చివరకు జడ్పీ చైర్మన్ రెండు లక్షల రూపాయలు నిధులను ఇచ్చారని, అయితే ఈ నిధులు సరిపోనందున మళ్లీ అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నానని చెప్పారు. ఇంత వరకు అయిదుసార్లు వినతిపత్రాలు సమర్పించానని చెప్పారు. కేవలం తాను వైసిపికి చెందిన నాయకుడిని అయినందునే నిధుల విడుదలలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

చిత్రం ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు