ఆంధ్రప్రదేశ్‌

కంచె ఐలయ్యపై చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 23: ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై ప్రత్యక్ష చర్యలకు త్వరలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ప్రకటించనున్నట్టు కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద చెప్పారు. అన్ని వర్గాల పెద్దలతో సమీక్షించిన పిమ్మట ఐలయ్యపై ప్రకటన చేస్తామన్నారు. దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఆయన వ్యాఖ్యలున్నాయని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని శ్రీపీఠంలో స్వామీ పరిపూర్ణానంద శనివారం విలేఖరులతో మాట్లాడారు.
లక్ష కోట్లు ఇస్తే బైబిల్‌తో ప్రచారం చేస్తానని ఐలయ్య చెప్పారని, జాకీర్‌నాయక్‌ను మించి ప్రమాదకరమైన వ్యక్తి అని విమర్శించారు. మన దేశం నుండి మత పరమైన అనేక అంశాలను ఇతర దేశాలకు చేరవేసి, హిందూ మతాన్ని భ్రష్టు పట్టించేందుకు కుట్ర పన్నారని ఐలయ్యపై మండిపడ్డారు. మతాన్ని వదిలిపెట్టిన తర్వాత హిందూ మతంపై మాట్లాడే అర్హత ఐలయ్యకు లేదని, వదిలివేసిన మతంపై చర్చించడం చట్టవిరుద్ధమని సూచించారు. మా స్థానాల మీద, మా మూలాల మీద కన్ను వేసిన వారికి వారు తట్టుకోలేని రీతిలో మా చర్యలుంటాయ ని స్పష్టం చేశారు. కలుపు మొక్క వంటి ఐలయ్యపై త్వరలో ఓ ప్రకటన చేస్తానని, ప్రస్తుతం శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండటంతో ఇది సందర్భం కాదని పేర్కొన్నారు. తన తల్లికి రెండు కళ్లు కనిపించవని, ఆమె సూచించిన ప్రకారం తనకు పట్టడం తెలియదని, పెట్టడమే తెలుసునని అభిప్రాయపడ్డారు. తాను సుమారు 300 గ్రామాలను దత్తత తీసుకున్నానని, తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం సుమారు 8వేల మంది పిల్లలను చదివిస్తున్నానని చెప్పారు. నిజమైన క్రైస్తవులంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. ఓ ఛానల్ లో ఐలయ్యకు తనకు మధ్య జరిగిన చర్చ లో తల్లిదండ్రులను ఐలయ్య విమర్శించారని పేర్కొన్నారు. దళితులు మతం మార్చుకుంటే వారికి రిజర్వేషన్లు పొందే అధికారం ఉండదని చెప్పారు. ‘్భరతదేశం అన్నపూర్ణ వంటి దేశమని, ప్రపంచంలో సుమారు 100 క్రైస్తవ దేశాలు అడుక్కుని తింటున్నాయని, చేతనైతే అక్కడికి వెళ్ళి సేవలందించు’ అని ఐలయ్యకు సూచించారు. హిందూ ధర్మంపై పిచ్చి కూతలు, కులాలపై చెత్తరాతలు రాస్తూ, క్రైస్తవం ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్న ఐలయ్యను క్రైస్తవులే తిరిగి విమర్శించే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పారు. ఐలయ్యపై నిర్భయ, పోటా చట్టం వంటి కేసులను నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. ప్రవచనకర్త డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న స్వామి పరిపూర్ణానందపై ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో ఐలయ్య ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేశారని వ్యాఖ్యానించారు. ఐలయ్యను ఈ ప్రాం తం నుండి తరిమివేయాలని ఆయన సూచించారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న స్వామి పరిపూర్ణానంద