ఆంధ్రప్రదేశ్‌

పంటల్లేవు.. పరిహారం రాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 23: రాజధాని అమరావతికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు దగాపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రభుత్వం కౌలు చెల్లించక పోవటంతో అటు పంటలకు నోచుకోక, ఇటు నష్టపరిహారం అందక విలవిల్లాడుతున్నారు. భూసమీకరణలో భాగంగా ప్రభుత్వం జరీబు రైతులకు ఎకరానికి రూ. 50వేలు, మెట్టపొలం ఎకరానికి రూ. 25వేలు ఏటా 10శాతం పెంపుదలతో పదేళ్లపాటు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది రైతులు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారనే కృతజ్ఞతాభావంతో రూ. 9కోట్ల మేర చెల్లింపులు జరిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రెండో విడత నష్టపరిహారంగా కౌలు చెల్లించాలి. అయితే మే నెల ముగుస్తున్నా ఇప్పటివరకు ఆ ఊసే లేకపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పంటపొలాలను ప్రభుత్వానికి అప్పగించి బీళ్లుగా మార్చామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం కౌలు చెల్లించేలోగా మూడు పంటలు పండించుకునే వాళ్లమని, రాజధాని కోసమంటే స్పందించి భూములిచ్చిన రైతులను నిర్లక్ష్యం చేయటం తగదని వాపోతున్నారు. రాజధానిలో ప్లాట్ల కేటాయింపు విధానంపై అభ్యంతరాలకు సంబంధించి ఫారం 9.18 దాఖలు చేసేందుకు నెలరోజుల వ్యవధి కోరితే కుదరదని ప్రభుత్వం తేల్చిచెప్పి ఈ నెల 25వరకు మాత్రమే అవకాశం ఇచ్చిందని, ఇంత తక్కువ వ్యవధిలో తాము పంపిణీని ఎలా నిర్ణయించుకోగలమని ప్రశ్నించారు. ఈవిషయంపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు సీఆర్డీయే కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులను లోపలికి ప్రవేశించనీయకుండా కార్యాలయానికి తాళాలు వేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న రైతులను అదుపులోకి తీసుకున్నారు. నష్టపరిహారం చెల్లించక పోవటంతో తాము అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నామని, మరోవైపు గ్రామకంఠాల సమస్యను తేల్చకుండా అధికారులు, పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారని రైతులు ధ్వజమెత్తారు. కౌలు చెల్లింపుపై ప్రశ్నిస్తే సీఆర్డీయే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో పోలీసులను మోహరించి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమీకరణ పూర్తయిన ఒకటి, రెండు గ్రామాలకు మాత్రమే ముందుగా ప్లాట్లు కేటాయించాలని భావిస్తోందని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా కేటాయింపులుండాలన్నారు.

చిత్రం కృష్ణాయపాలెంలో బైఠాయించిన రైతులు