ఆంధ్రప్రదేశ్‌

సత్‌ప్రవర్తన, విలువలతో మెలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 23: చట్టసభల్లో సభ్యులు సత్‌ప్రవర్తన, విలువలతో మెలుగుతూ నియమావళి పాటించి ప్రపంచానికి ఆదర్శవంతంగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎ చక్రపాణి ఉద్బోధించారు. ‘చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన- నైతిక విలువల ఆచరణ’ అనే అంశంపై ఎథిక్స్ కమిటీ ఆధ్వర్యంలో తొలి సదస్సు విశాఖలో సోమవారం జరిగింది. ఈ సదస్సులో చక్రపాణి మాట్లాడుతూ చట్టాలకు రూపకల్పన చేసే సభ్యులే విలువలను పాటించకపోవడం బాధాకరమన్నారు. చట్టాల సవరణకు, నూతన చట్టాల రూపకల్పనకు సభలో ఏకాగ్రతతో సమర్థవంతమైన చర్చలు జరగాలని, ప్రజలకు మేలు చేకూర్చే చట్టాలను రూపొందించడం ద్వారా సభ్యులు తమ బాధ్యతను నెరవేర్చాలని కోరారు. అయితే ప్రస్తుత పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో సభ్యులు రాజకీయ పార్టీల లక్ష్యాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని, ఇటువంటి ఘర్షణాత్మక వాతావరణంలో చట్టసభల్లో అర్థవంతమైన చర్చలకు తావు లేకుండా పోతోందన్నారు. చట్టసభల్లో హుందాగా వ్యవహరించాల్సిన సభ్యులే తత్ భిన్నంగా వ్యవహరిస్తోంటే ఇక సామాన్య ప్రజానీకం చట్టాలను ఏవిధంగా గౌరవిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చట్టసభల్లో నియమావళిని పాటించని సభ్యులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిని శిక్షించే విధంగా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎథిక్స్ కమిటీ చైర్‌పర్సన్ కె ప్రతిభా భారతి మాట్లాడుతూ చట్టసభలను సభ్యులు గౌరవించాల్సిందేనన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన మీదట రూపొందించిన ప్రవర్తన నియమావళికి సభ్యులే కనీస గౌరవం ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. శాసనసభ, మండలి సభ్యులు చట్టసభల సంప్రదాయలను పాటిస్తూ, విలువలకు కట్టుబడి నడచుకోవాలని సూచించారు. సభ్యుల ప్రవర్తనా నియమావళిపై రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు, రాజకీయ కోవిదులతో విస్తృతంగా సమీక్షించడంతో పాటు నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖలో న్యాయవాదులు, రాజకీయ విశే్లషకులు, రాజ్యాంగ నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.
చిత్రం ‘చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన- నైతిక విలువల ఆచరణ’ అంశంపై సోమవారం విశాఖలో జరిగిన సమావేశంలో
మాట్లాడుతున్న మండలి చైర్మన్ చక్రపాణి, ఎథిక్స్ కమిటీ చైర్‌పర్సన్ ప్రతిభాభారతి