ఆంధ్రప్రదేశ్‌

ప్రకంపనలు సృష్టిస్తున్న అడ్వకేట్ జనఠల్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్‌గా పరాంకుశం వేణుగోపాల్ రాజీనామా వ్యవహారం న్యాయ సంస్థలను దిగ్భ్రాంతికి గురిచేసింది. హైకోర్టు సీనియర్ న్యాయవాదులు సైతం దీనిపై విస్మయాన్ని వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన కొద్ది గంటలకే వేణుగోపాల్ హైకోర్టులోని తన కార్యాలయాన్ని ఖాళీ చేయటం మరిన్ని ఊహాగానాలకు దారితీసింది. అదనపు అడ్వకేట్ జనరల్‌గా వ్యవహరిస్తున్న దమ్మలపాటి శ్రీనివాస్‌ను అడ్వకేట్ జనరల్‌గా నియమించేందుకు వీలుగా వేణుగోపాల్ రాజీనామా చేశారనే వార్తలు వచ్చాయి. కుల పోరులో భాగంగానే ఎజి రాజీనామా చేశారా అనే అనుమానాలు హైకోర్టు న్యాయవాదుల్లో వ్యక్తమవుతోంది. అడ్వకేట్ జనరల్‌ను మార్చాలనే భావన చాలాకాలంగా ముఖ్యమంత్రి మనసులో పడిందన్న సమాచారాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు ద్వారా తెలుసుకున్న వేణుగోపాల్ తన పదవికి రాజీనామా చేశారని హైకోర్టు వర్గాల సమాచారం. రాష్ట్ర పునర్విభజనతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఎపికి కేంద్రం నుండి ఆర్థిక సహకారాన్ని రాబట్టడంలోనూ పదో షెడ్యూలులోని సంస్థల విభజన, జల వివాదాలు తదితర అంశాలకు సంబంధించి సమర్థంగా వ్యవహరించిన వేణుగోపాల్‌ను ప్రభుత్వం 2014 జూన్ 20న నియమించింది. అప్పటికే ఎజిగా కొనసాగుతున్న ఎ సుదర్శన్‌రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్స్ కె జి కృష్ణమూర్తిలు కొత్త ఎజి నియామకానికి వీలు కల్పిస్తూ రాజీనామా చేశారు. ఉస్మానియా లా యూనివర్శిటీ నుండి డిగ్రీ పొందిన వేణుగోపాల్ వి రంగనాధన్ వద్ద ప్రాక్టీస్ చేస్తూ 1983లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, ఆ తరువాత హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా, బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం అదనపు అడ్వకేట్ జనరల్‌గా ఉన్న దమ్మలపాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ వద్ద జూనియర్‌గా పనిచేశారు. తర్వాత ఆయన ఎస్ ఆర్ అశోక్ వద్ద జూనియర్‌గా కొనసాగారు. రైల్వే స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. నమ్మకస్తుడైన వ్యక్తినే అడ్వకేట్ జనరల్‌గా నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో దమ్మలపాటికి ఆ పదవి దక్కనుందని సమాచారం. ఆయనను ఎజిగా నియమించిన పక్షంలో రెండు అదనపు అడ్వకేట్ జనరల్ పదవులు ఖాళీ అవుతాయి. వాటికి మరో ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది.