ఆంధ్రప్రదేశ్‌

నేటి నుండి ఇంటర్ సప్లిమెంటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు భారీ ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి జూన్ 1వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 4,69,547 మంది హాజరుకానున్నారు. ఇందులో ఫస్టియర్ 3,49, 664 మంది, సెకండియర్ విద్యార్థులు 1,19,883 మంది రాస్తున్నారు. ఇందులో బాలురు 2,57,546 మంది కాగా బాలికలు 2,12,001 మంది ఉన్నారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. ఫస్టియర్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకూ జరగనున్నాయి. సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకూ జరుగుతాయి. సిట్టింగ్ స్క్వాడ్‌లు 65, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు 50 నియమించామని, ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 39 కేంద్రాల్లో సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇంటర్ బోర్డు డోర్ నెంబర్ 48-185-2/ఎ, నాగార్జున నగర్, ఆయుష్ హాస్పిటల్, విజయవాడ-8లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.