ఆంధ్రప్రదేశ్‌

వేగం పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 24: గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్‌డిఎ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాజధాని కేంద్రమైన తుళ్లూరు పరిధిలోని వెలగపూడి గ్రామంలో జరుగుతున్న సచివాలయ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రుల చాంబర్లు, హెచ్‌ఒడి కార్యాలయాలు, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సచివాలయ ఉద్యోగుల విధులకు వీలుగా ప్రత్యేక చాంబర్లు, గదుల నిర్మాణాలను ప్రభుత్వం అనుకున్న గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి, శాసనసభ బ్లాకులు ఆలస్యం అయినా ఉద్యోగులకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల 15వ తేదీలోపు సచివాలయ భవనాలను పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి అందించాలని ఎల్‌అండ్‌టి, షాపూర్జీ పల్లోంజి సంస్థ ప్రతినిధులకు సూచించారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచాలని ఆదేశించారు. సచివాలయ ముఖద్వారం, విజిటర్స్ గ్యాలరీ తదితర ఏర్పాట్లపై సిఎం సమీక్షించారు. ముఖ్యమంత్రితో పాటు జపాన్ ప్రతినిధుల బృందం తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో సీడ్ క్యాపిటల్ భవనాల నిర్మాణంపై సిఎం జపాన్ ప్రతినిధులకు వివరించారు. అమరావతిలో పెట్టుబడులకు సానుకూల అంశాలపై చర్చించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న రాజధానిలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పురపాలక శాఖ మంత్రి నారాయణ, గుంటూరు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ చెరుకూరి శ్రీ్ధర్, సిఆర్‌డిఎ కమిషనర్ ఎన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... సచివాలయ నిర్మాణ పనుల ప్లాన్‌ను పరిశీలించి అధికారులకు సూచనలిస్తున్న చంద్రబాబు