ఆంధ్రప్రదేశ్‌

కాలినడక భక్తుల కోసం ప్రత్యేక కాంప్లెక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మే 24: శ్రీవారి దర్శనార్థం కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులు వేచి ఉండేవిధంగా నూతన క్యూకాంప్లెక్స్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని టిటిడి ఇ ఓ డాక్టర్ సాంబశివరావు ఇంజనీరింగ్ అధికారులను మంగళవారం ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో మంగళవారం సీనియర్ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు.కాలినడక భక్తులకు సౌకర్యవంతంగా నూతన కాంప్లెక్స్‌ను నిర్మించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించి వారంలోపు నివేదికను సమర్పించాలని సూచించారు.
నూతన కాంప్లెక్స్‌లో లగేజీ కౌంటర్లు, ఆర్ ఓ తాగునీటి వసతి, స్కానింగ్ పాయింట్ తదితర ఏర్పాట్లతో భక్తులకు సౌకర్యవంతంగా ఉండాలని కూడా ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఆయన మంగళవారం ఇ.ఓ అటవీశాఖ అధకారులతో కలిసి పార్వేట మండపం సమీపంలో ఉన్న ఎర్రచందనం వనాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 88 హెక్టార్లలో ఎర్రచందనం చెట్లను అభివృద్ధి పరిచే ప్రణాళికను రూపొందించమని టిటిడి ఫారెస్టు ఆఫీసర్‌ను ఆదేశించారు.

కటక్‌లో బస్సు బోల్తా

మహిళ దుర్మరణం
నరసరావుపేటనుంచి
తీర్థయాత్రలకు వెళ్తున్న భక్తులు

నరసరావుపేట, మే 24: గుంటూరు జిల్లా నరసరావుపేట నుండి వారణాసికి తీర్థయాత్రకు వెళుతున్న బస్సు ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ వద్ద అదుపుతప్పి లోయలో పడిన సంఘటనలో నరసరావుపేట బరంపేటకు చెందిన రాజారపు రామతులశమ్మ (63) మృతి చెందారు. మరో మహిళకు తీవ్రగాయాలై అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్లు తెలిసింది. రామతులశమ్మ మృతి పట్ల కుటుంబసభ్యులు, బంధువులు మనోవేదనకు గురయ్యారు. ఈ నెల 20న నరసరావుపేట పట్టణం, పరిసర గ్రామాల నుండి 40మంది కాశీ తీర్థయాత్రకు బయలుదేరారని తెలిపారు. నరసరావుపేట పట్టణం నుండి 20మంది, పరిసర గ్రామాల నుండి 20మంది ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఒరిస్సా సమీపంలో బస్ డ్రైవర్ నిద్రమత్తులో తూగడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడినట్లు సమాచారం.