ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో స్టేట్ టూరిస్ట్ గైడ్‌లకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 9: ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ గైడ్‌ల శిక్షణకు క్యాలెండర్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సోమవారం విశాఖపట్నం వేదికగా స్టేట్ టూరిస్ట్ గైడ్ శిక్షణను ప్రారంభించింది. ఇందులో ఇరవై మందికి అవకాశం ఉండగా, వీరికి 75 రోజుల పాటు శిక్షణ అందించనున్నామని అథారిటీ సిఇఓ హిమాన్షు శుక్లా తెలిపారు. శిక్షణా కాలంలో వీరికి ఉచిత వసతి, భోజనంతోపాటు ప్రతినెల వేతనం కూడా అందిస్తామన్నారు. అక్టోబరు 12 నుండి స్వగృహ ఫుడ్స్ తయారీ, 17 నుండి ప్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, క్యాబ్ డ్రైవర్స్ ట్రైనింగ్, 19 నుండి హౌస్ కీపింగ్‌లలో ప్రతి బ్యాచ్‌కు 30మంది చొప్పున శిక్షణ అందిస్తామన్నారు. మరోవైపు విశాఖపట్నంతోపాటు ఏలూరు, రాజమండ్రిలలో కూడా శిక్షణా కార్యక్రమాలను చేపడతామన్నారు.