ఆంధ్రప్రదేశ్‌

రాజధాని ప్రాంతంలో ప్రపంచబ్యాంకు బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుళ్లూరు, మే 26: రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణ సాయం అందించేందుకు సూచనప్రాయంగా అంగీకరించింది. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గురువారం పర్యటించారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయం, కృష్ణాతీర ప్రాంతంలో పర్యటించిన ప్రపంచబ్యాంకు బృందం తుళ్లూరు సీఆర్డీయే కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఆర్డీయే ల్యాండ్స్ డైరెక్టర్ చెన్నకేశవులు మాట్లాడుతూ రాజధాని నిర్మాణంపై పలు వివరాలను సేకరించినట్లు తెలిపారు. కృష్ణానది వరద ఉద్ధృతి కొండవీటివాగు ముంపు, రాజధాని ప్రాంత ప్రజల జీవనప్రమాణాలు, వౌలిక సదుపాయాలు తదితర అంశాలపై వివరాలు సేకరించారు.
506.9 అడుగులకు సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్, మే 26: నాగార్జునసాగర్ నీటిమట్టం గురువారం సాయంత్రానికి 506.9 అడుగుల వద్దకు చేరుకుంది. ఇది 126.4667 టిఎంసిలకు సమానం. సాగర్ ప్రాజెక్టు నుండి జంట నగరాల ప్రజలకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి సాగర్ ప్రాజెక్టుకు నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 775 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇది 18.5410 టిఎంసీలకు సమానం. సాగర్ ప్రాజెక్టు నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి నీటి చేరిక నిలిచిపోవడంతో సాగర్‌లో ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయిందని సాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.