ఆంధ్రప్రదేశ్‌

తెలుగు భాష, సాహిత్యంపై మహానాడులో ప్రకటన చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 26: రాష్ట్రంలో తెలుగు భాష, సాహిత్యానికి సంబంధించి విధానాన్ని తిరుపతిలో జరుగనున్న మహానాడులో ప్రకటించాలని లోక్‌నాయక్ ఫౌండేన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్ డిమాండ్ చేశారు. విశాఖలో గురువారం విలేఖరులతో మాట్లాడుతూ తిరుపతిలో జరుగనున్న మహానాడులో ఈ విషయాన్ని చర్చించి విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయనగరంలోని గురజాడ ఇంటిని వివిధ కారణాల వల్ల కూల్చి వేసి అపార్టుమెంట్ నిర్మాణానికి గురజాడ వారసులు ప్రతిపాదించారని, భవనాన్ని కూల్చివేసిన సమయంలో ప్రభుత్వం దాన్ని స్మారక మందిరంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించిందని తెలిపారు. ఈ నెల 30న విజయనగరంలో గురజాడ ఇంటిని స్మారక మందిరంగా తీర్చిదిద్దే ప్రాజెక్టుకు సంఘీభావంగా రచయితలు, గురజాడ అభిమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖలోని శ్రీశ్రీ నివాసాన్ని కూడా స్మారక భవనంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. తెలుగు జాతి గొప్పదనాన్ని చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరుగుతున్న మహానాడులో తెలుగు భాషకు సంబంధించిన అంశాలను అజెండాలో చేర్చాలని, దానిపై విధానం ప్రకటించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్మారక కట్టడాలను పరిరక్షించాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రముఖ రచయిత రామతీర్థ అన్నారు. ప్రముఖ రచయిత చందు సుబ్బారావు మాట్లాడుతూ 1956లో రాష్ట్రానికి పేరు పెట్టే సమయంలోనూ అన్యాయం జరిగింద న్నారు.