ఆంధ్రప్రదేశ్‌

ఒకరి తరువాత ఒకరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 16: ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేతలందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా పార్టీ కండువా కప్పాలని భావిస్తున్నట్లు టిడిపి నేతల ద్వారా తెలుస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభమైతే తలెత్తే రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు అధికార టిడిపి సైతం సిద్ధమవుతోంది. వైకాపా నుంచి టిడిపిలో చేరడానికి ఉత్సాహంగా ఉన్న ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులకు అధినేత చంద్రబాబు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇప్పటికే వైకాపాకు చెందిన కర్నూలు ఎంపి బుట్టా రేణుక టిడిపి తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. ఆమె మంగళవారం అమరావతిలో సిఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఇక కడప జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేత ఒకరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, ముగ్గురు వైకాపా నాయకులు టిడిపిలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
జగన్ పాదయాత్ర చేస్తే వచ్చే నష్టం పెద్దగా లేకపోయినా ఆయనను మానసికంగా దెబ్బతీయడానికి వైకాపా నుంచి చేరికలు తోడ్పడతాయని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. పార్టీని వీడి అధికారం కోసం వెళ్తున్నారన్న అంశాన్ని జనంలోకి వైకాపా సమర్థవంతంగా తీసుకుపోగలిగితే జగన్ పాదయాత్రకు అనుకున్నంత మైలేజీ వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో పార్టీలో జరిగే పరిణామాలను పట్టించుకుని సరిదిద్దుకునే సమయం ఉండదని టిడిపి నేతలు భావిస్తున్నారు.
వైకాపాలో నేతలు జగన్ మినహా ఇతర నేతలతో చర్చించి సంతృప్తి చెందే పరిస్థితుల్లో లేరని, అదే సమయంలో 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చే హామీకి ఇతరులు ఇచ్చే హామీకి చాలా తేడా ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు అంటున్నారని టిడిపి నేతలు పేర్కొంటున్నారు. విడతల వారీగా వైకాపా నుంచి టిడిపిలో చేర్చుకోవడం ద్వారా జగన్ దృష్టిని పాదయాత్ర నుంచి పార్టీని కాపాడుకునే వైపు మళ్లించడం ద్వారా యాత్రను భగ్నం చేయవచ్చన్నది టిడిపి యోచనగా తెలుస్తోంది. టిడిపి ఎత్తుగడలను వైకాపా నేత జగన్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సి ఉందని రాజకీయ విశే్లషకులు వెల్లడిస్తున్నారు.