రాష్ట్రీయం

నీట్‌పై కొత్త మెలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: ఎఐపిఎంటి స్థానే నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్టు -2 (నీట్-2)లో సైతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూకాశ్మీర్ విద్యార్థులకు మెలిక పెట్టారు. అపెండిక్స్-3లో నీట్ నిర్వహణ కమిటీ సెల్ఫ్ డిక్లరేషన్ నిర్దేశించింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూకాశ్మీర్‌లకు చెందిన విద్యార్థులు తాము స్థానికులం కాదని, తాము ఆంధ్రాలో, తెలంగాణలో మెడికల్ సీట్లకు/డెంటల్ సీట్లకు అర్హులం కాదని పేర్కొంటూ అండర్‌టేకింగ్ ఇవ్వాలని పేర్కొంది. ఈ అండర్‌టేకింగ్‌పై విద్యార్థి సంతకం, వేలిముద్ర కూడా సేకరిస్తోంది. ఒకవేళ ఈ డిక్లరేషన్ ద్వారా తాము తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే ఎలాంటి న్యాయపరమైన చర్యలకైనా సిద్ధమేనని పేర్కొంటూ అభ్యర్థులు సంతకం చేయాల్సి ఉంటుంది. అంటే నీట్-2 రాసేందుకు పరోక్షంగా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన స్థానికులు అర్హులు కారనేది పరోక్షంగా నీట్-2 బృందం స్పష్టం చేస్తోంది.
విద్యార్థుల్లో అస్పష్టత
నీట్-2 రాయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ఉత్తర్వులు నేటివరకూ ఇవ్వలేదు, లిఖిత పూర్వకమైన ప్రకటన కూడా చేయలేదు. నీట్-2 రాయాలా వద్దా అనే అంశంపై నేటికీ విద్యార్థుల్లో స్పష్టత కొరవడింది. ఆంధ్రాలో మాత్రం అభ్యర్థులు నీట్-2కు హాజరుకావాలని మంత్రి ప్రకటన మినహా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో తాము హాజరుకావాలా వద్దా అనే మీమాంసలో పడ్డారు. తాజాగా అండర్‌టేకింగ్‌తో విద్యార్థులు మరింత ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి అధికారులు నిరాకరించారు. నీట్-2కు సంబంధించి అక్కడి అధికారులే వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్థానిక అధికారులు పేర్కొన్నారు.
అఫిడవిట్ అర్థరహితం
నీట్-2కు దరఖాస్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు స్థానికేతరులమని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలనడం అర్థరహితమని ప్రవేశ పరీక్షల నిపుణుడు, శ్రీచైతన్య విద్యాసంస్థల డీన్ డి శంకరరావు చెప్పారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న స్థానికేతరులు మాత్రమే స్థానిక సీట్లకు పోటీ పడబోమని పేర్కొంటూ ఈ అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నీట్ -2 దరఖాస్తులోని అపెండిక్స్-3లో ఈ ప్రోఫార్మా ఇవ్వడంతో విద్యార్ధులు తికమకపడుతున్నారు. 371(డి) పరిధిలో ఆంధ్రా, తెలంగాణ, జమ్మూకాశ్మీర్ ఉండటంతో ఈ నిబంధనలు అనివార్యమయ్యాయని అన్నారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు నేషనల్ పూల్‌లో ఈ ఏడాదికి లేవు కనుక మొత్తం సీట్లకు స్థానికులు పోటీ పడవచ్చని, స్థానికంగా ఉన్న 85 శాతం సీట్లకు పోటీ పడలేకపోతున్న మిగిలిన స్థానికేతరులు ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుందని, ఈ మేరకు నీట్ పరీక్షల బోర్డ్ వివరణ ఇవ్వాలని శంకరరావు డిమాండ్ చేశారు. అఫిడవిట్ దాఖలు చేసిన వారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ ప్రైవేటు కాలేజీలు, డీమ్డ్ యూనివర్శిటీల్లో మొత్తం సీట్లకు అర్హులవుతారని, ప్రభుత్వ సంస్థల్లోని కాలేజీల్లో మాత్రం 15 శాతం సీట్లకు అర్హులు అవుతారన్నది నీట్ బోర్డ్ ఉద్దేశం కావచ్చని ఆయన వివరించారు.

నీట్-2 దరఖాస్తులో పేర్కొన్న అపెండిక్స్-3లో జతచేసిన డిక్లరేషన్ ప్రొఫార్మా