ఆంధ్రప్రదేశ్‌

‘నిరుద్యోగ భృతి’పై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంఖ్య తేల్చేందుకు సర్కారు చర్యలు
సిఎం వచ్చేనాటికి పూర్తిస్థాయి ప్రణాళిక
సమీక్షలో మంత్రి లోకేష్ వెల్లడి

విజయవాడ, అక్టోబర్ 18: నిరుద్యోగ భృతి అమలులో అనుసరించాల్సిన విధి విధానాలపై వెలగపూడిలో బుధవారం మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర నిర్వహించిన సమీక్ష సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సంఖ్యను తెలుసుకోవడానికి వివిధ శాఖలనుండి సమాచారాన్ని సేకరించి అనుసంధానం చెయ్యడం ద్వారా లబ్ధిదారులను గుర్తించే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి అర్హతలపై చర్చ జరిగింది. వయస్సు, విద్యార్హత, ఆర్థిక పరిస్థితి ఇలా అనేక విషయాలపై ఇప్పటికే సిద్ధం చేసిన సమాచారంపై చర్చించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సంఖ్యను తేల్చేందుకు వివిధ శాఖల నుండి సేకరించిన సమాచారాన్ని అనుసంధానించి సిఎం చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చేలోపు పథకం అమలుకు కావల్సిన పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేయ్యాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. విద్యార్హత ఆధారంగా భృతి చెల్లించే అంశంపై చర్చించారు. బెంగాల్‌లో నిరుద్యోగ భృతి అమలు చేసినప్పుడు నిరుద్యోగులను గుర్తించేందుకు ఎంప్లాయ్‌మెంట్ బ్యాంకు ఏర్పాటు చేసిన అంశం చర్చకు వచ్చింది. బెంగాల్‌లో నిరుద్యోగులు భృతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ మాదిరిగా కొన్ని మార్పులు చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఉపయోగించి నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకునే విధంగా ఒక ప్రక్రియ రూపొందించాలి అని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, కార్యక్రమం ప్రారంభం అయిన తరువాత ఇబ్బందులు రాకుండా ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిరుద్యోగ భృతి ప్రకటించిన తరువాత దరఖాస్తు చేసుకున్న ఎవరికైనా ఈ పథకం వర్తించకపోతే ఆన్‌లైన్‌లో ఎందుకు భృతి రాలేదు అనే సమాచారం కూడా ఇచ్చే వ్యవస్థను రూపొందించాలని మంత్రి అధికారులను కోరారు. నిరుద్యోగ భృతి పథకంలో భృతి తీసుకునే వారిని సామాజిక కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొనేలా ఒక కార్యాచరణ కూడా రూపొందించాలని తెలిపారు. అర్హత ఉన్న నిరుద్యోగులందరికీ పథకం వర్తించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిరుద్యోగ భృతి తీసుకునేవారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి నచ్చిన రంగాల్లో రాణించే విధంగా ఒక కార్యక్రమం సిద్ధం చెయ్యాలని మంత్రి నారా లోకేష్ అన్నారు.