ఆంధ్రప్రదేశ్‌

గుండెపోటుతో మహిళా ఎఎస్‌ఐ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, అక్టోబర్ 22: విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎఎస్‌ఐ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపట్నం మండలం పల్లపట్ల గ్రామానికి చెందిన ఓగిబోయిన సామ్రాజ్యం (57) 1984లో పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరారు. 2014 సెప్టెంబర్ నుండి కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నారు. ఇటీవలే ఎఎస్‌ఐగా పదోన్నతి పొందారు. శనివారం రాత్రి డ్యూటీకి వచ్చారు. ఆదివారం ఉదయం 6గంటలకు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే తనకు తలనొప్పిగా వుందని, కళ్లు తిరుగుతున్నాయని సహచరులకు చెబుతూనే కుర్చీలో కూర్చోబోయి కుప్పకూలిపోయారు. సహచరులు వెంటనే ఆమెను తెనాలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందింది.