ఆంధ్రప్రదేశ్‌

ఐక్యతగా ఉంటే పైకొస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 22: బీసీలు ఐకమత్యంగా ఉంటేనే సామాజికాభివృద్ధి సాధ్యపడుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలంతా ఒకే కులమనే భావజాలం రావాలని, మన ఓటు మన కులానికే అనే ఐక్యత రావాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన బీసీ గర్జన కార్తీక సమారాధన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చారిత్రాత్మక గడ్డ రాజమహేంద్రవరం నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 2600 బీసీ కులాల్లో 2505 కులాలు ఇప్పటివరకు పార్లమెంట్‌లో అడుగు పెట్టలేదన్నారు. రాష్ట్రంలో 130 బీసీ కులాలు అసెంబ్లీలో అడుగు పెట్టలేదన్నారు. ఆంగ్లో ఇండియన్ల మాదిరిగా బీసీ కులాలకు నామినేషన్ పదవులు ఇస్తున్నారని విమర్శించారు.
ఇప్పటికే అనేక దేశాలు తమ తమ రాజ్యాంగాలను అనేకసార్లు మార్చుకున్నాయని, దేశంలో కూడా అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని సవరించుకున్నారని, మరోసారి రాజ్యాంగాన్ని సవరించైనా న్యాయం చేయాలని పాలకులను డిమాండ్ చేస్తున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీసీలను గుర్తించకపోతే బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి భరతం పడతామన్నారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని, బీసీలకు క్రీమీలేయర్ అమలుచేయాలన్నారు. అగ్రవర్ణాలు వారి ఓట్లను వారి కులాలకే వేస్తాయని, అదేవిధంగా బీసీల ఓట్లు బీసీ కులాలకే వేసుకునే చైతన్యం రావాలన్నారు. గతంలో ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కొంతమంది కుల సంఘాలను వెంటబెట్టుకుని కలిస్తే అందరిలో ఐక్యత వస్తే మీరడిగే 50 శాతం కంటే అదనంగా సీట్లు ఇస్తామని, ఐక్యంగా ఉంటారా అని ప్రశ్నించారని గుర్తుచేశారు. బీసీల్లో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా అన్ని ఓట్లు కట్టగట్టి వేస్తే అన్ని పార్టీలు గజగజలాడతాయన్నారు. ప్రధాని వారణాసి నుంచి ఎంపీగా నెగ్గారంటే బీసీలంతా ఓటేయబట్టేనన్నారు. ముస్లిం సోదరుల ఐకమత్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బీసీల పార్టీ పెట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోందని, ముందు మనలో కులాన్ని బట్టి ఓటేసే ఐక్యత వచ్చినపుడే అది సాధ్యమవుతుందన్నారు.

చిత్రం..రాజమహేంద్రవరం గర్జన సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న బీసీ సంఘ నేతలు