ఆంధ్రప్రదేశ్‌

ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 23: రాష్ట్రంలోని 9 కోస్తా జిల్లాల్లోని 77 మండలాల్లో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు జిల్లా, మండల అత్యవసర కేంద్రాల సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐఎండి డిజిఎం కెజె రమేష్‌తో కలసి సమీక్ష అనంతరం విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కోస్తా తీర ప్రాంతాలు 9 జిల్లాల పరిధిలో ఉండటం వల్ల ఈ ప్రాంతంలో వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా సంభవిస్తున్నాయన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల బలమైన గాలులు, రుతుపవనాల సమయంలో అధిక స్థాయిలో వర్షాలు, వాతావరణ స్థితిగతులను ముందుగానే అధ్యయనం చేసి వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో సంభవించే నష్టాలను గణనీయంగా తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిశా నిర్దేశంలో ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ద్వారా ప్రజలకు అందించడం ద్వారా నష్టాల స్థాయిని గణనీయంగా తగ్గించడం కోసం కృషి చేస్తుందన్నారు. ఇందుకోసం ప్రముఖ విశ్వవిద్యాలయాలు, షార్, ఇస్రో, ఎన్‌ఆర్‌ఎస్‌ఈ, ఐఎండి తదితర సంస్థల అధ్యయనాల ద్వారా రూపొందించిన ఉత్తమమైన అంశాలను పొందుపరచి రాష్టస్థ్రాయిలో నిర్దిష్టమైన ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. వాతావరణ స్థితిగతులను ముందుగానే అంచనా వేసి రైతులకు, ప్రజలకు తెలియజేయడంలో ఐఎండి ముందస్తు సమాచారం అందించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఉపగ్రహాలు, రాడార్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఫలితాలను సాధించడంలో కమిషనర్ శేషగిరిబాబు ఆధ్వర్యంలో ఎపిఎస్‌డిఎంఎ సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. ప్రకృతి విపత్తులను 5 నుంచి 7 రోజుల ముందుగానే, పిడుగుల సమాచారాన్ని 30 నిమిషాల ముందే అందించే వ్యవస్థను అభివృద్ధి చేశామన్నారు. ఐఎండి డిజిఎం కెజె రమేష్ మాట్లాడుతూ డేటా సేకరణలో వైవిధ్యం ఉండదని, అయితే ఆ డేటాను సరిగ్గా విశే్లషణ చేయడం ద్వారా వచ్చే ఫలితాలు ఎంతో ఉపయోగంగా నిలుస్తాయన్నారు. ఆ దిశలో ప్రభుత్వం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా ఉత్తమమైన ఫలితాలను రాబట్టగలుగుతోందన్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ ఎంవి శేషగిరిరావు మాట్లాడుతూ వాతావరణంలోని మార్పులను ముందస్తుగానే గుర్తించడం ద్వారా నష్టాల తీవ్రతను గణనీయంగా తగ్గించగలుగుతామన్నారు. ఈడి కె.శివశంకరరావు, ఐఎండి డైరక్టర్ పివి రాజు, ఎన్‌ఎఆర్‌ఎన్‌కు చెందిన అమిత్ పి.కేస్కర్ ఇన్కోయిస్‌కు చెందిన పట్ట్భారాం, ఏపిఎస్‌డిపిఎస్‌కు చెందిన పివి రమణమూర్తి, ఏపి శాక్‌కు చెందిన కెవి రమణ, పరిపాలన అధికారులు వి.నాన్‌రాజు, జివి రామా, వైకె రెడ్డి, తదితర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప