ఆంధ్రప్రదేశ్‌

వంశధార నిర్వాసితులకు పరిహారం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 23: శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్ట్ బాధిత ప్రజానీకానికి పునరావాస పునర్నిర్మాణ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని అంతవరకు, ఏ ఒక్క కుటుంబాన్ని వారి వారి నివాస గృహాల నుంచి తరిమివేయవద్దంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బహిరంగ లేఖ రాశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అన్ని రకాల పరిహారాలను అందచేయాలన్నారు. ఈ ప్రాజెక్ట్ రెండవ దశ పనుల మూలంగా దాదాపు 7వేల 100 కుటుంబాలను నిర్వాసిత కుటుంబాలుగా గుర్తించినప్పటికీ వీరిలో సగం కుటుంబాలకు కూడా నేటివరకు పునరావాస పునర్నిర్మాణ ఏర్పాట్లను పూర్తిచేయలేదన్నారు. 14 పునరావాస కాలనీలను ప్రతిపాదిస్తే వాటిలో మంచినీరు, రోడ్లు మొదలుకుని శ్మశానాల వరకు అవసరమైన ఏర్పాట్లలో ఏ ఒక్కటీ సంపూర్ణం కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానం జీవో 68 నిబంధన 6.2(ఎ) ప్రకారం ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించాల్సి ఉండగా గార్లపాడులో రెండున్నర సెంట్లు మాత్రమే కేటాయించినా అది కూడా ఎక్కడో చూపలేదన్నారు. హిర మండలం బస్టాండ్ వెనుకనున్న పునరావాస కాలనీలో మెరక చేయలేదని, పులిపుట్ట ఆర్‌ఆర్ కాలనీలో ప్లాట్లకు మార్కింగ్ లేదని ఇలా ఏ కాలనీలోనూ సౌకర్యాలు లేవన్నారు. అయితే రికార్డుల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు చూపుతున్నారంటూ మధు ధ్వజమెత్తారు.