ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడ కృతజ్ఞతా పర్యటన వారంపాటు హైదరాబాద్‌లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 28: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మర్యాదపూర్వక కృతజ్ఞతా పర్యటన కొనసాగుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలోపల జరిగిన ఈ పర్యటన..ఇప్పుడు హైదరాబాద్‌లో మొదలైంది. ముద్రగడ వారం రోజులపాటు హైదరాబాద్‌లోనే మకాం ఉండి పలువురు నేతలను మర్యాదపూర్వకంగా కలిసి తన ఉద్యమానికి నైతిక బలాన్నిచ్చినందుకు, సంఘీభావం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేసే పనిలో నిమగ్నమయ్యారు. శనివారం ముద్రగడ హైదరాబాద్‌లో పిసిసి చీఫ్ రఘువీరారెడ్డిని కలిశారు. తన ఉద్యమానికి ముందుగా భేషరతుగా మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు తెలియజేసినట్టు సమాచారం. ఇదే సహకారాన్ని చివరి వరకూ అందించాలని కోరినట్టు తెలిసింది. రిజర్వేషన్ సాధించడం తన ఉద్యమ ప్రథమ లక్ష్యమని, రుణాలు తదితరాలు ఆ తరువాతేనని ముద్రగడ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్‌కు పార్లమెంటులో బిల్లు కావలసిన క్రమంలో అవసరమైన శక్తియుక్తులను ఇప్పటి నుండే సమకూర్చుకుంటున్నట్టు ఉంది. ఇందులో భాగంగానే ముద్రగడ హైదరాబాద్‌లో అందరనీ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెసు పార్టీకి చెందిన నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ముద్రగడ తుని ఘర్జనకు వెడుతుండగా గృహనిర్బంధానికి గురైన మాజీ ఎంపి హర్షకుమార్‌ను కలిశారు. రాజమహేంద్రవరంలో తుని గర్జనకు వచ్చి రామహేంద్రవరంలోని ఒక హోటల్ గదిలో పోలీసు నిర్బంధానికి గురైన దాసరి నారాయణరావునూ హైదరాబాద్‌లో ముద్రగడ కలవనున్నారు. చిరంజీవి, రఘువీరా మధురపూడి విమానాశ్రయం వద్ద పోలీసుల నిర్బంధానికి గురయ్యారు. చిరంజీవిని కూడా ముద్రగడ ఈ పర్యటనలో కలవనున్నారు. ప్రధానంగా తెలంగాణా సిఎం కెసిఆర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వీరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా పెనుమార్పులు చోటుచేసుకోవచ్చునని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ముద్రగడ మర్యాదపూర్వక పర్యటన పట్ల సర్వత్రా ఉత్కంఠత రేగుతోంది.