ఆంధ్రప్రదేశ్‌

రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 43వేల కోట్లు ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 28: రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొనబడిన అంశాలన్నింటినీ దశలవారీగా నెరవేర్చే దశలో కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వివిధ పద్దుల కింద భారీగా నిధులను కేటాయించడమే గాక కేవలం గడచిన రెండేళ్లలో ముందెన్నడూ లేని విధంగా ఒక లక్షా 43వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేయటం జరిగిందని వీటిలో అత్యధికం ఇప్పటికే కార్యరూపం దాల్చాయని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు వెల్లడించారు. కేంద్రంలో రెండేళ్ల ఎన్‌డిఎ పాలన పూర్తయిన సందర్భంగా పార్టీపరంగా రాష్ట్రంలో విజయోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రభూమి ప్రతినిధితో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హరిబాబు ఈ రాష్ట్రానికి మంజూరైన ప్రాజక్టులు, నిధుల గురించి వివరించారు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఈ విధమైన కేటాయింపులు జరగలేదన్నారు. ప్రధానంగా 12 జాతీయ సంస్థల ఏర్పాటుకు ఏడువేల కోట్లు కేటాయించబడినాయి. ఇందులో ఐఐటీకి రూ.700 కోట్లు, ఐఐఎంకు రూ.680 కోట్లు, ఐఐఎస్‌ఈఆర్‌కు రూ.870 కోట్లు, ఐఐఐటికి రూ.130 కోట్లు, ఎన్‌ఐటీకి రూ.300 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. తిరుపిల్లిపాలెంలో ఎన్‌ఐఓటి ఓసియన్ రీసెర్చ్ ఫెసిలిటీకి రూ.250 కోట్లు, చింతలదీవిలో జాతీయ కామధేను పరిశోధన కేంద్రం, కాకినాడ బలభద్రపురంలో జాతీయ మత్స్య విద్యాసంస్థ, భారత సౌర విద్యుత్ కార్పొరేషన్, ఏపి జెన్‌కో, నెడ్‌క్యాప్ సంయుక్త నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌లో సౌర పార్కు. ఇందుకోసం అనంతపురంలో 1500 మెగా సౌర విద్యుత్ పార్క్, కర్నూలులో 1000 మెగా సౌర విద్యుత్ పార్కు ఏర్పాటు జరగనుందన్నారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి ఏపి ఎక్స్‌ప్రెస్, కాకినాడలో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూ.450 కోట్లతో బహుళ సరకు రవాణా పార్కు, విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయికి తిరుపతి విమానాశ్రయం, హుద్ హుద్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న విశాఖ విమానాశ్రయాన్ని 5రోజుల్లో పునరుద్ధరణ, రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రాత్రిపూట విమానాలు దిగే సదుపాయంతో పాటు జాతీయ రహదారులకు రూ.65వేల కోట్ల కేటాయింపు జరిగిందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా రూ.7,500 కోట్లు మంజూరు, హృదయ్ పథకం ద్వారా అమరావతి, విజయవాడ, విశాఖపట్నం మెట్రోలకు రూ.22కోట్లు కేటాయింపు, గుంటూరు జిల్లా ఎడ్లపాడులో సుగంధ ద్రవ్యాల కేంద్రం ఏర్పాటు, వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.700 కోట్లు, హుద్‌హుద్‌కు రూ.500 కోట్లు మంజూరు, కృష్ణపట్నంలో రూ.277 కోట్ల అంచనాతో నిర్మించే అంతర్జాతీయ తోలు ఉత్పత్తుల సముదాయ ప్రాజెక్టులో భారత ప్రభుత్వ పెట్టుబడి వాటా రూ.125 కోట్లు, సొసైటీ ఫర్ అఫ్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (సమీర్)కు రూ.80 కోట్లు కేటాయింపు, పింగళి వెంకయ్య పేరుతో విజయవాడలో ప్రత్యేక దూరదర్శన్ కేంద్రం ఏర్పాటు, అనంతపురం పాలసముద్రంలో రూ.300 కోట్లతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏర్పాటు, నాగాయలంకలో రూ.1000 కోట్లతో డిఆర్‌డిఓ క్షిపణి పరీక్ష కేంద్రం మంజూరు జరిగిందన్నారు.
2014-15 రెవెన్యూ లోటు భర్తీకి రూ.2,303 కోట్లు మంజూరు, రాజ్‌భవన్, శాసనసభ, సచివాలయాలకు రూ.1500కోట్లు కేటాయింపు, కొత్త పరిశ్రమల యంత్ర పరికరాలపై అదనపు పెట్టుబడి అలవెన్స్ 15 శాతం పెంపు, కొత్త పరిశ్రమల యంత్ర పరికరాలపై తరుగుదల రాయితీ 20 శాతం నుంచి 35 శాతానికి పెంపు జరిగిందన్నారు. 14వ ఆర్థిక సంఘ నిధులు రూ.2,06,819 కోట్లు పెరిగాయి. ఏడాదికి రూ.41,364 కోట్ల నిధులు వస్తుండగా, 13వ ఆర్థిక సంఘం నిధులు కన్నా అదనంగా రూ.29,374 కోట్లు సమకూరుతున్నాయన్నారు.
కొత్తగా విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, రాజమండ్రిలో పెట్రోలియం విశ్వవిద్యాలయం, కొత్త చమురుశుద్ధి కర్మాగం, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం, నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో నౌకాశ్రయం, బకింగ్‌హామ్ కెనాల్, మన్నవరం కెనాల్ పునరుద్ధరణ, జల రవాణా, కాకినాడలో విదేశీ వాణిజ్య కేంద్రం రానున్నాయని హరిబాబు తెలిపారు.