ఆంధ్రప్రదేశ్‌

బోనులో చిక్కిన చిరుత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 24: కపిలతీర్థం వద్దనున్న అటవీ ప్రాంతంలో రెండున్నర సంవత్సరాలున్న చిరుత మంగళవారం బోనులో చిక్కింది. గత 15 రోజులుగా ఒక పెద్ద చిరుత, దాని పిల్లగా భావిస్తున్న చిన్న చిరుతపులి కపిలతీర్థం అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈనేపథ్యంలో గత వారం క్రితం చిరుతపులి కపిలతీర్థం సమీపంలోని దివ్యారామం వద్దనున్న అటవీ శాఖాధికారి క్యాంపు కార్యాలయం వద్ద కుక్కను చంపడానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. వారిని గమనించిన చిరుత కుక్కను వదిలి పారిపోయింది. ఈ విషయాన్ని సిబ్బంది తమ పైఅధికారులకు తెలియజేశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కార్తీకమాసం సందర్భంగా కపిలతీర్థానికి వచ్చే భక్తులకు ప్రమాదం కలగకుండా దివ్యారామం వద్ద వారం క్రితమే రెండు బోన్లు ఏర్పాటుచేసి కుక్కలను ఎర వేశారు. మంగళవారం తెల్లవారుజామున చిన్న చిరుత బోనులో చిక్కింది. అనంతరం తప్పించుకోవడానికి భీకరంగా అరుస్తూ బోన్లను పంజాతో కొట్టడం ప్రారంభించింది. దీనిని గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది బోనులో చిరుత చిక్కిన విషయాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అధికారులు అక్కడకు చేరుకుని బోనులో చిక్కిన చిరుతకు మత్తుమందు ఇచ్చి ఎస్వీ జూపార్కుకు తరలించారు. అయితే పెద్ద చిరుత పులి తప్పించుకు తిరుగుతుండటంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.