ఆంధ్రప్రదేశ్‌

నకిలీ విలేఖరి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 24: తిరుమలలో విలేఖరినని చెప్పుకుంటూ దర్శనం, లడ్డూల అనుమతులు పొంది భక్తుల నుంచి అధిక మొత్తంలో నగదు తీసుకుని ధనార్జనకు పాల్పడుతున్న శ్రీనివాసులు అనే వ్యక్తిని తిరుమల వన్‌టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సిఐ వెంకటరవి కథనం మేరకు శ్రీనివాసులు అనే యువకుడు టి 5 చానల్ పేరుతో తిరుమలలో తిరిగేవాడన్నారు. ఈనేపథ్యంలో ఈ ఏడాది మే 2వ తేదీన భక్తులను మోసం చేసినట్లు టిటిడి విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. 2015లో డిటి అనే ఛానల్ ఆంధ్రాకు సంబంధించి విధులు నిర్వహించాడన్నారు. ఈక్రమంలో హైదరాబాదుకు చెందిన కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ సంజీవ్ తిరుమలకు వచ్చినప్పుడు ఆయనతో పరిచయం పెంచుకున్నాడని తెలిపారు. ఆయనకు చెందిన ఆధార్, గుర్తింపుకార్డులో తన పేరు, ఫోటోను మార్పింగ్ చేసి తరచూ దర్శనాలకు వెళ్లేవాడన్నారు. ఈ క్రమంలో సుమారు 13 మంది భక్తులను దర్శనానికి పంపించి వారి నుంచి రూ.25వేలు సొమ్ము తీసుకున్నట్లు ఫిర్యాదులున్నాయని వివరించారు.